సండే స్పెషల్.. మటన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే అస్సలు వదిలిపెట్టరు

Updated on: May 17, 2026 | 6:00 AM

మటన్ వెల్లుల్లి కారం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీని వెల్లుల్లి, కొద్దిగా కారం, తక్కువ మసాలాలతో చేస్తారు. ఈ కూరను ఎక్కువగా చపాతీల్లోకి తింటారు. మరి, ఇంకెందుకు లేట్ మీరు ఇక్కడ దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
మటన్ వెల్లుల్లి కారం గురించి  ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీని వెల్లుల్లి, కారం, మసాలాలతో చేస్తారు. ఈ కూరను ఎక్కువగా చపాతీల్లోకి తింటారు. మరి, ఇంకెందుకు లేట్ మీరు ఇక్కడ దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
ముందుగా మటన్ ను బాగా ఉడికించాలి: ముందుగా మటన్ తీసుకుని దానిని ఉడకబెట్టి, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి బాగా ఉడికించుకోవాలి. ఇలా ముక్కలకు పట్టిస్తే కూర మంచి టేస్ట్ వస్తుంది.

3 / 5
ఇప్పుడు వెల్లుల్లి కారంను ప్రిపేర్ చేసుకోవాలి: ముందుగా వెల్లుల్లిని తీసుకుని రెబ్బలుగా విడతీసి ఆ తర్వాత వాటి పొట్టు తీసి మిక్సీ  గిన్నెలో వేసి ఈ వెల్లుల్లి రెబ్బలు, 10 ఎండుమిర్చి, ధనియాల , ఇంకా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి వాటిని పొడి లాగా చేసుకోవాలి.

4 / 5
ఇలా పోపు పెట్టుకోవాలి : ఇప్పుడు పాన్‌ తీసుకుని దీనిలో ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక  అర టేబుల్ స్పూన్ పోపు గింజలు, ఇంకా కరివేపాకు ఆకులు కూడా వేసి వీటిని బాగా వేయించాలి. ఆ తర్వాత  ముందుగా ఉడికించి పెట్టుకున్న  మటన్ పాన్‌లో వేసి స్టవ్ మీదే ఉంచి బాగా వేయించాలి.

5 / 5

 చివర్లో మటన్ కు వెల్లుల్లి కారం ఇలా పట్టించుకోవాలి : ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం, మటన్ కు పట్టేలా కనీసం 15 నిముషాల పాటు  మీడియం మంట మీద ఉంచాలి. చివర్లో కొత్తిమీర వేసుకుని తినడమే. ఇంకా దీనిని వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచే సూపర్ గా ఉంటుంది. ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు.

Follow Us