
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎంతో ఇష్టంగా తాటి ముంజలు తింటారు. అయితే చాలా వరకు తాటి ముంజలు అంటే నార్మల్‌గా తీసుకొని తినడమే అనుకుంటారు. కానీ వీటితో ఇలా కర్రీ చేసుకొని తింటే అదిరిపోతుందంట. అంతే కాకుండా ఇవి ఎక్కువగా సమ్మర్‌లోమాత్రమే దొరుకుతాయి కాబట్టి, ఈ సీజన్‌లోనే చేసుకునే డిఫరెంట్ , టేస్టీ కర్రీ ఇదే. మరీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు : తాటి ముంజలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, నూనె, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, పల్లీలు, లవంగాలు, కొబ్బరి తురుము, ఉల్లిపాయలు, కరివేపాకు.

తయారీ విధానం : ముందుగా తాటి ముంజల కర్రీ కోసం మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. దీని కోసం ఉల్లిపాయలు, గసగసాలు, కొబ్బరి తురుము, పల్లీలు అన్నీ తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు తాటి ముంజలు తీసుకొని వాటి పై ఉన్న పొట్టు తీసి, ముంజలను శుభ్రంగా కడిగి పదినిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి. అందులో పోపు దినుసులు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచి కలిసి పచ్చి వాసన పోయేలా ఉడికిన తర్వాత ఇందులో తాటి ముంజలు వేసుకోవాలి.

ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత, ఇందులో కారం ఉప్పు, వేసి మరో పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ను కూడా వేయాలి. దీని తర్వాత కర్రీ కాస్త దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేయాలి. ఇలా పదినిమిషాల పాటు ఉడకనిస్తే కర్రీ రెడీ.