వేసవి స్పెషల్ ఫ్రూట్.. ఈత పండ్లను ఎప్పుడైనా తిన్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం

|

Oct 20, 2024 | 1:58 PM

ఈతపండ్లు.. ప్రకృతి ప్రసాధించిన పండ్లలో ఈతపండ్లు ఒకటి. ఇవి పల్లెలు, గ్రామాల నేపథ్యం కలిగిన వారికి ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. పట్టణాలు, నగరాల్లోనూ వీటిని అమ్ముతుంటారు. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా ఇవి ప్రకృతిలో ఇవి పండుతాయి. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఈతపండ్ల తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
వేసవిలో ఈతపండ్లు విరివిగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా పల్లెటూళ్లలో దొరుకుతాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వీటిని ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు. పచ్చివి అయితే కాస్త వగరుగా, బాగా పండినవి అయితే తియ్యగా ఉంటాయి. ఈతకాయలు మొదట ఆకూ పచ్చని రంగులో ఉండి ఆ తర్వాత పసుపు పచ్చని రంగులోకి మారి ఆ తర్వాత బాగా మగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి.

2 / 6
వేసవిలో లభించే ఈత పండ్లను అందరూ తినాలి. మరీ ముఖ్యంగా పిల్లలకు తినిపిస్తే వారిలో ఎదుగుదల బాగుంటుంది. వీటిలో సమృద్ధిగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి. ఈతపండ్లు తినేవారి మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారికి ఈ సీజన్‌లో దొరికే ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనపడుతుంది.

3 / 6
ఈత చెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి. ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెల్లం కూడా తయారుచేస్తారు. ఈత పండులో పోషక విలువలు పుష్కలంగా వుంటాయి. ఈత పండ్లను ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరు తినొచ్చు. ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు.

4 / 6
ఈత పండ్లు పిల్లలకి తినిపించడం వల్ల కాల్షియం ఎక్కువగా అందుతుంది. దాని వల్ల ఎముకలు బలపడుతయాయి. ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. ప్రతి 100 గ్రాములకు పిండిపదార్థాలు 65 గ్రాములుంటాయి. చక్కెరలు 53 గ్రాములుంటే పీచుపదార్థాలు 6 గ్రాములుంటాయి. ఈత పండ్లలో కొవ్వు పదార్థాలు 0.4 గ్రాములుంటే మాంసకృత్తులు 2.5 గ్రాములుంటాయి. నీరు 21 గ్రాములంటే విటమిన్ సి 0.4 మిల్లీగ్రాములుంటుంది.

5 / 6
ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్,సుక్రోజ్, ఫ్రక్రోజ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సీజన్‌లో ప్రతి రోజూ ఉదయం పూట ఈతపండ్లు తినడం వల్ల జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా చేస్తుంది. ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల రక్త వృద్ధి జరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటానికి ఉపయోగ పడుతుంది. ఈత కాయలు తింటే అల్జీమర్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

6 / 6
ఈత పండ్లలో క్యాల్షియం పుష్కలంగా నిండి ఉంటుంది. కనుక వీటిని తినేవారికి ఎముక పుష్టి కలుగుతుంది. ఈత పండ్లు, ఈత కల్లులో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్త వృద్ధి జరుగుతుంది. అలాగే నిస్సత్తువ, అలసట వంటివి తగ్గుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి ఈత పండ్లకు ఉంటుంది. ఈత పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెల్లం కూడా తయారుచేస్తారు. వేసవిలో శరీర వేడిని తగ్గించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి ఈత కాయలు, ఈత కల్లు.