ఎండల్లో వేడి చేసి ఇబ్బంది పడుతున్నారా.. ఈ పులుసు బెస్ట్.. తిన్నారంటే జీవితంలో వదలరు

Updated on: Mar 15, 2026 | 10:29 AM

మండే ఎండలకు ఈ పులుసు చాలా బెస్ట్. వేసవి కాలంలో ఎంతో మంది వేడి సమస్యలతో బాధ పడతారు. దీనిని వేడి వేడి అన్నంలో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి, దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు :  పెద్ద ఉల్లిపాయలు , 5 కప్పుల పెరుగు,  7 పచ్చిమిరపకాయలు ,  ఒక టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, కొత్తిమీర,  అర కప్పు నూనె, పావు టీ స్పూన్,  ఆవాలు,  జీలకర్ర, కరివేపాకులు తీసుకోవాలి.

2 / 5
ముందుగా కట్ చేసిన ఉల్లియలు, పచ్చి మిర్చిని తీసుకుని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో గిన్నె తీసుకుని పెరుగు వేసి దానిని కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

3 / 5

ఇక ఇప్పుడు మిశ్రమాన్ని తీసుకుని దానిలో అర టీ స్పూన్ పసుపు వేసి స్పూన్ తో బాగా కలిపి ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు , ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.

4 / 5
ఆ తర్వాత  స్టవ్ లేక కట్టెల పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె వేసి ఆవాలు, కొద్దిగా జీలకర్ర, రెండు ఎండు మిర్చి, నాలుగు కరివేపాకు ఆకుల  వేసి ఆ తాలింపులో  ఈ పెరుగు మిశ్రమాన్ని వేసి రెండు లేక మూడు గ్లాస్ లు నీళ్ళు పోసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.

5 / 5
చివర్లో  పెరుగు మిశ్రమం తాలింపులో కలిసిపోయాక కొత్తిమీర వేసి గరిటేతో బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే  అదిరిపోయే టేస్టీ వస్తుంది.  మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.  ఇది సద్దన్నంతో తింటే  టేస్టీగా ఉంటుంది.

Follow Us