
ఈ ఏడాది వేసవిలో ఎండలు తీవ్రంగానే ఉండేట్లు ఉన్నాయి. మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. చల్లదనం కోసం ప్రజలు అనేక మార్గాలను వెతుక్కుంటున్నారు. ఏసీలు, కూలర్లు వాడటం మొదలుపెట్టారు. అయితే, ఫ్యాన్ లేదా కూలర్ మాత్రమే కాకుండా, ఏసీని నిరంతరం ఉపయోగించడం వల్ల కూడా విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో, సహజమైన పరిష్కారాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన మొక్కలను నాటడం వలన చల్లని వాతారవణం ఏర్పడుతుంది. గాలి శుభ్రం అవుతుంది. తేమ స్థాయిలు పెరుగుతాయి. ఇంటి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది ఒక చవకైన, సులభమైన, తక్కువ ఖర్చుతో సాధ్యమైన మార్గం.

చల్లగా ఉంచే ప్రత్యేకమైన మొక్కలు.. పోకచెట్టు.. 'తేమను పెంచే చెట్టు' అని కూడా పిలుస్తారు. గాలి శుభ్రం చేసి, వాతావరణాన్ని చల్లగా చేస్తుంది. ఇంటి తోటలో లేదా బాల్కనీలో నాటితే చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది

కలబంద (Aloe Vera).. చర్మ సౌందర్యానికి మాత్రమే కాకుండా, ఇంటిని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. గాలి నుంచి వేడిని గ్రహించి, ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది. తక్కువ నీటితో, తక్కువ శ్రద్ధతో పెరుగుతుంది.

స్నేక్ ప్లాంట్ (Snake Plant).. రాత్రిపూట కూడా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. నైట్రోజన్ ఆక్సైడ్ వంటి విష వాయువులను గ్రహించి గాలి శుభ్రం చేస్తుంది. పడకగదిలో పెట్టడానికి అత్యుత్తమం.

తులసి (Holy Basil).. సులభంగా అందుబాటులో ఉంటుంది. గాలి శుద్ధి చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గాలిలో ఓజోన్ స్థాయిని పెంచి, ఇంటిని తాజాగా ఉంచుతుంది. సువాసనతో మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.

స్పైడర్ ప్లాంట్ (Spider Plant).. ఇంటికి ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. గాలి నుంచి మలినాలను తొలగిస్తుంది. తక్కువ నీరు, సంరక్షణతో పెరుగుతుంది. చిన్న కుండీలలో కూడా సులభంగా పెంచుకోవచ్చు.

ఫెర్న్ (Fern) దట్టమైన ఆకులు గదిలోని వేడిని గ్రహిస్తాయి. గదిలో తేమను పెంచి చల్లబరచడంలో ప్రభావవంతం. గదిలో కూర్చోవడం మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. ఈ మొక్కలు వేసుకోవడం ద్వారా, మీరు ఎక్కువ శక్తి వినియోగం లేకుండా, సహజంగా ఇంటిని చల్లగా ఉంచవచ్చు.