
ఇటీవలే కాలంలో మనుషుల అలవాట్లు మారిపోతున్నాయి. చెప్పాలంటే కొందరు ఆరోగ్యంపైన శ్రద్ధ తీసుకోవడమే మానేశారు. ఇలా నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇంకొందరు గ్యాస్, ఎసిడిటీతో బాధ పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఇంటి చిట్కా పాటిస్తే చాలు ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

టైం సరిగా లేక సమయానికి భోజనం చేయడమే మానేస్తున్నారు అలాంటి టైం లో బయటి ఫుడ్స్ పై ఆధారపడటం వలన వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. అందుకే మరి ఎక్కువ ఘాటు కూడా తినకూడదు. దీని వలన కడుపులో మంట రావడం, ఆకలి మొత్తానికే తగ్గిపోతోంది. దీని కోసం ఎన్నో మందులు వాడుతారు

ఎలాంటి మందులు లేకుండా మీ కిచెన్ లో ఉండే వాటితోనే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు. దీని కోసం ఈ చిట్కాను పాటిస్తే చాలు.. గ్యాస్, మంట అన్నీ వెంటనే మాయం అవుతాయి. అంతేకాదు, ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. అదేంటో యెక్కడ చదివి ఎలా చేయాలో తెలుసుకుకోండి.

సమస్య కొంచం ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు బాగా పని చేస్తాయి. మీరు ముందుగా పొయ్యి మీద చిన్న గిన్నె దాని మీద పెట్టి ఒక గ్లాసు మంచి నీళ్ళు పోసి అర స్పూన్ జీలకర్ర పొడి వేసి 5 నిమిషాల పాటు బాగా ఎర్రగా మరిగించాలి. ఆ తర్వాత దీనిలో చిన్న బెల్లం ముక్క కూడా వేసి దీనిలో మంచిగా మరిగించాలి. గ్యాస్ పట్టేసినప్పుడు తాగితే ఉపశమనం పొందుతారు

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)