
బాలసనం: మోకాళ్లపై కూర్చుని, ముందుకు వంగి నుదుటిని నేలకు ఆనించాలి. చేతులను ముందుకు చాచి సుదీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఈ ఆసనం నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. వెన్నుముక, భుజాలు, నడుము కండరాల్లోని ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

సుఖాసనం, ప్రాణాయామం: కాళ్లను మడచి నిటారుగా కూర్చుని, చేతులను మోకాళ్లపై ఉంచాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఈ ఆసనం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచి, క్షణాల్లో ఆందోళనను మైండ్ నుండి దూరం చేస్తుంది.

విపరీత కరణి : గోడకు ఆనుకుని వెల్లకిలా పడుకుని, రెండు కాళ్లను గోడపైకి నిటారుగా ఉంచాలి. చేతులను ఇరువైపులా సడలించి పడుకోవాలి. కాళ్లలో రక్తప్రసరణను మెరుగుపరిచి, రోజంతా పడిన అలసటను, పాదాల నొప్పులను క్షణాల్లో మాయం చేస్తుంది.

భుజంగాసనం: బోర్లా పడుకుని, అరచేతులను ఛాతీకి ఇరువైపులా ఉంచి, నెమ్మదిగా శరీరం పైభాగాన్ని పైకి లేపాలి. ఛాతీని విస్తరింపజేసి శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. అలసటను తగ్గించి, శరీరంలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది.

శవాసనం : యోగా చివరలో వెల్లకిలా పడుకుని, కాళ్లు, చేతులను సడలించి కళ్లు మూసుకోవాలి. కేవలం శ్వాసపైనే దృష్టి పెట్టాలి. ఇది సంపూర్ణ విశ్రాంతిని ఇస్తుంది. శరీరంలోని ప్రతి అవయవాన్ని రిలాక్స్ చేసి, నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. రోజూ ఉదయం లేదా సాయంత్రం 15 నుండి 20 నిమిషాలు ఈ యోగాసనాలు సాధన చేయడం ద్వారా ఎలాంటి ఒత్తిడినైనా జయించి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.