
బ్రెడ్ - బీర్.. డేంజర్ కాంబినేషన్: బీర్ తాగేటప్పుడు చాలా మంది బర్గర్లు లేదా శాండ్‌విచ్‌లు తింటుంటారు. కానీ బీర్, బ్రెడ్ రెండింటిలోనూ ఈస్ట్ ఉంటుంది. ఇవి రెండూ కడుపులో కలిసినప్పుడు ఈస్ట్ పరిమాణం పెరిగి.. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి బదులుగా ఉడికించిన కూరగాయలు లేదా సలాడ్లు తీసుకోవడం ఉత్తమం.

చాక్లెట్లతో జాగ్రత్త: డార్క్ చాక్లెట్‌లో కెఫిన్, కోకో ఉంటాయి. వీటిని ఆల్కహాల్‌తో కలిపి తీసుకోవడం వల్ల కడుపులో మంట, అసిడిటీ పెరుగుతాయి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెట్టడమే కాకుండా గుండెల్లో మంటకు కారణమవుతుంది.

చిక్కుళ్లు, పప్పు ధాన్యాలు: పప్పులు, బఠానీలు లేదా కిడ్నీ బీన్స్ వంటి వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. మద్యం సేవించినప్పుడు మన జీర్ణ ప్రక్రియ ఇప్పటికే నెమ్మదిగా ఉంటుంది. దీనివల్ల ఈ ఆహారం కడుపులో ఎక్కువ సేపు ఉండిపోయి నొప్పి మరియు అజీర్ణం కలిగిస్తుంది.

వేయించిన స్నాక్స్: మద్యంతో చిప్స్ లేదా ఫ్రైస్ తీసుకోవడం సర్వసాధారణం. కానీ వీటిలో ఉండే అధిక ఉప్పు శాతం మీ శరీరంలోని నీటిని లాగేస్తుంది. మద్యం కూడా శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఫలితంగా మరుసటి రోజు ఉదయం తీవ్రమైన తలనొప్పి, అలసట మరియు హ్యాంగోవర్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

సిట్రస్ పండ్లు: నారింజ వంటి పుల్లని పండ్లలో యాసిడ్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. మద్యం తాగుతున్నప్పుడు వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇది కడుపులో చికాకును, వికారాన్ని కలిగిస్తుంది.