
శ్రీశైలం మల్లన్న ఆలయానికి 33 రోజుల హుండీ ఆదాయం రూ 5 కోట్ల 28 లక్షల 37 వేల 281 నగదు. బంగారం 96 గ్రాముల 500 మిల్లీగ్రాములు,3 కేజీల 780 గ్రాముల వెండి ఇంకా వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ ఆదాయంల వచ్చింది. హుండీ లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు.

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా ఉండి ఆదాయం లభించింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు అక్క మహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపును నిర్వహించారు.

ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 5 కోట్ల 28 లక్షల 37 వేల 281 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఈ ఆదాయాన్ని గత 33 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు

ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 96 గ్రాముల 500 మిల్లి గ్రాములు బంగారం అలానే వెండి 3 కేజీల 780 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు యుఎస్ఏ డాలర్లు 321, కెనడా డాలర్లు 105, ఒమన్ బైసాలు 200,యూఏఈ దిర్హమ్స్ 20, ఇంగ్లాండ్ పౌండ్స్ 25, మలేషియా రింగిట్స్ 14 వచ్చాయి.

ఇంకా ఆస్ట్రేలియా డాలర్లు 35, కత్తార్ రియాల్స్ 5, సింగపూర్ డాలర్లు 2 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా ఈ హుండీ లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు,దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు.