

బౌలింగ్ పై ఇంకా పూర్తిగా పట్టు సాధించకపోవడంతో హార్దిక్ పాండ్యాకు ఈసారి టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశం లేదని తెలుస్తోంది.

రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, గిల్, కెఎల్ రాహుల్ ఓపెనర్లుగా ఎంపిక కానుండగా.. ఐపీఎల్‌లో అదరగొట్టిన పృథ్వీ షాకు మరోసారి నిరాశే దక్కనుంది.

రవీంద్ర జడేజాతో పాటు అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకోనున్నారని తెలుస్తోంది.

బౌలింగ్ విభాగం గురించి మాట్లాడితే, 25 ఏళ్ల ప్రసిద్ద్ కృష్ణ ఎంపిక అయ్యే ఛాన్స్ ఉంది. ఇక జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్‌లు ఎంపిక కావడం ఖాయం.

మరికొన్ని గంటల్లో ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా సమరం మొదలు కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్, భారత్ జట్లు ముఖాముఖి తలబడనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు టీమిండియా 15 మంది సభ్యులను ఎంపిక చేయగా.. వారిలో తుది జట్టులో చోటు ఎవరు దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం..