
లార్డ్స్‌లో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 138 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమిన్స్ దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. కమిన్స్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టి కొత్త చరిత్ర లిఖించాడు.

148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరెవరూ సాధించలేని రికార్డును కమిన్స్ నెలకొల్పాడు. మొదటి రోజు వియాన్ ముల్డర్ వికెట్ తీసిన పాట్ కమిన్స్, రెండవ రోజు మొదటి సెషన్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా వికెట్ తీయడం ద్వారా తన వికెట్ల పంట పండించాడు.

రెండవ సెషన్‌లో కమిన్స్ ఒకే ఓవర్‌లో కైల్ వెర్రెన్, మార్కో జాన్సెన్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత 45 పరుగులు చేసిన వియాన్ ముల్డర్‌ను అవుట్ చేసి 5 వికెట్ల హాల్ సాధించాడు. ఇది అతని కెరీర్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడం 14వ సారి. చివరికి కమిన్స్ ఇన్నింగ్స్ చివరి వికెట్ తీయడం ద్వారా మరో చరిత్ర సృష్టించాడు.

కమిన్స్ తన ఆరో వికెట్‌గా చివర్లో కగిసో రబాడను అవుట్ చేశాడు. దీనితో అతను 68 టెస్ట్ మ్యాచ్‌లలో 126 ఇన్నింగ్స్‌లలో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. కమ్మిన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 18.1 ఓవర్లు బౌలింగ్ చేసి, కేవలం 28 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. 148 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ముఖ్యంగా లార్డ్స్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన తొలి విదేశీ కెప్టెన్‌గా నిలిచాడు.

గతంలో లార్డ్స్‌లో విదేశీ కెప్టెన్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన రికార్డు న్యూజిలాండ్ స్పిన్నర్ డేనియల్ వెట్టోరి పేరిట ఉండేది. అతను 69 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. ఇది మాత్రమే కాదు, లార్డ్స్‌లో ఏ కెప్టెన్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన రికార్డు కూడా ఇది. వెట్టోరి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బాబ్ విల్లీస్ రికార్డును బద్దలు కొట్టాడు. 1992లో భారత్‌పై జరిగిన ఇన్నింగ్స్‌లో విల్లీస్ 101 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు.