Paavo Nurmi Games-2022: జావెలిన్ త్రోతో సరికొత్త జాతీయ రికార్డు.. రజత పతకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రా

|

Jun 15, 2022 | 8:33 AM

paavo nurmi games 2022 : టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతక విజేత నీరజ్ ప్రస్తుతం ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్‌ 2022లో పాల్గొంటున్నాడు. నీరజ్ చోప్రా కెరీర్‌లో అత్యుత్తమ త్రో విసిరి.. తన పదునైన ఈటెతో జాతీయ రికార్డును బద్దలు కొట్టి, రజత పతకాన్ని గెలుచుకున్నాడు

1 / 6
టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం సాధించిన తొలి అథ్లెటిక్స్ ఆటగాడిగా నిలిచాడు. అప్పటి నుంచి నీరజ్ చోప్రా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నీరజ్ తనపై పెట్టుకున్న అంచనాలు తన ప్రతిభతో అందుకుంటున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం నీరజ్ మరో పతాకాన్ని అందుకున్నాడు.

2 / 6
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా జాతీయ రికార్డు సృష్టించాడు. నీరజ్ ప్రస్తుతం ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్‌ 2022లో పాల్గొంటున్నాడు. నీరజ్ 89.30 మీటర్ల త్రో విసిరి జాతీయ రికార్డు సృష్టించాడు. దీంతో ఈ టోర్నీలో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

3 / 6
ఒలింపిక్ క్రీడల తర్వాత నీరజ్‌కి ఇదే తొలి అంతర్జాతీయ టోర్న. ఒలింపిక్స్‌లో నీరజ్ 87.58 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

4 / 6
 నీరజ్  మొదటి ప్రయత్నంలో ఈటెను 86.92 మీటర్లు.. రెండవ ప్రయత్నంలో 89.30 త్రో విసిరాడు. అనంతరం మూడు ప్రయత్నాల్లో అతను ఫౌల్ అయ్యాడు. ఆరో ప్రయత్నంలో 85.85 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు.

5 / 6

 పావో నుర్మీ గేమ్స్‌ 2022లో ఫిన్‌లాండ్‌కు చెందిన 25 ఏళ్ల ఆలివర్ హెలాండర్ 89.83 మీటర్ల బెస్ట్ త్రోతో బంగారు విజేతగా నిలిచాడు. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్ 86.60 మీటర్ల త్రోతో కాంస్యం సాధించాడు.

6 / 6
 భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా 89.30 మీటర్లు విసిరి కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. గత ఏడాది మార్చిలో పాటియాలాలో చోప్రా నెలకొల్పిన జాతీయ రికార్డు 88.07మీ. అతను ఆగస్ట్ 7, 2021న 87.58 మీటర్ల త్రోతో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. నీరజ్ చోప్రా అథ్లెటిక్స్‌లో భారతదేశం యొక్క మొట్టమొదటి ఒలింపిక్ బంగారు పతక విజేత మరియు ఒలింపిక్స్‌లో రెండవ వ్యక్తిగత స్వర్ణ పతక విజేత.