
పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన రాష్ట్ర అథ్లెట్లకు హర్యానా ప్రభుత్వం ప్రైజ్ మనీ ప్రకటించింది. ఈ ప్రైజ్ మనీలో యువ షూటర్ మను భాకర్ రూ.5 కోట్లు అందుకోనున్నారు. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రూ.4 కోట్లు అందుకోనున్నాడు.

పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ 2 కాంస్య పతకాలు సాధించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత్ తరపున ఒలింపిక్ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించినందుకు మను భాకర్‌కు 5 కోట్లు ఇచ్చారు.

జావెలిన్ త్రోలో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాకు రూ.4 కోట్లు ప్రైజ్ మనీ లభించింది. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ పారిస్ ఒలింపిక్స్‌లో 89.45 మీటర్లు మాత్రమే విసిరాడు. దీంతో రెండో స్థానం సాధించి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

మను భాకర్‌తో కలిసి ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ షూటింగ్‌లో కాంస్య పతకం సాధించిన సరబ్‌జోత్‌సింగ్‌కు హర్యానా ప్రభుత్వం 2.5 కోట్లు బహుకరించింది.

అలాగే రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు రూ.2.50 కోట్లు అందించారు. దీని ద్వారా పారిస్ ఒలింపిక్స్‌లో రాణించిన రాష్ట్ర క్రీడాకారులకు హర్యానా ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇచ్చి ప్రోత్సహించింది.