IND vs NZ: ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో అత్యధిక రన్స్‌ చేసిన ప్లేయర్‌గా నిలిచేది ఎవరు? రేసులో టాప్‌ ప్లేయర్లు వీళ్లే

Updated on: Mar 06, 2025 | 1:24 PM

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఫైనల్‌ కోసం టీమిండియా, న్యూజిలాండ్‌ రెడీగా ఉన్నాయి. తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా, రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తుచేసి న్యూజిలాండ్‌ జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. ఇక ఈ రెండు జట్ల మధ్య పోటీతో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఎవరిదో తేలిపోనుంది. అయితే.. ఈ టోర్నీలో అత్యధిక రన్స్‌ చేసిన ప్లేయర్‌గా నిలిచే అవకాశం కూడా ఈ రెండు జట్లలోని ఆటగాళ్లకు ఉంది. మరి ఎక్కువ ఛాన్స్‌ ఎవరికి ఉందో ఇప్పుడు చూద్దాం..

1 / 5
ఇప్పటి వరకు అయితే అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. 3 మ్యాచ్‌ల్లో కలిపి డకెట్‌ 227 పరుగులు చేశాడు. అతని తర్వాత న్యూజిలాండ్‌ యువ సంచలనం, మన భారత సంతతికి చెందిన ఆటగాడు రచిన్‌ రవీంద్రా ఉన్నాడు. రచిన్‌ 3 మ్యాచ్‌ల్లో 226 పరుగులు చేసి సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాడు. రచిన్‌కు ఎలాగో టీమిండియాపై మంచి రికార్డ్‌ ఉండటంతో ఫైనల్‌ రెండు రన్స్‌ చేసినా డకెట్‌ను దాటేస్తాడు. కానీ మరిన్ని పరుగులు చేస్తే తన టీమ్‌లో ఉన్న ప్లేయర్లతో టీమిండియా ఆటగాళ్ల కంటే ముందు ఉంటాడు.

2 / 5
ఇక టీమిండియా సూపర్‌ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సైతం ఈ లిస్ట్‌లో దూసుకెళ్తున్నాడు. పాకిస్థాన్‌పై సెంచరీ, ఆస్ట్రేలియాపై 84 పరుగులు క్వాలిటీ ఇన్నింగ్స్‌తో ప్రస్తుతానికి కోహ్లీ 217 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో ఫైనల్‌లో రచిన్‌ తక్కువ పరుగులకు అవుటై, అతన్ని కోహ్లీ బీట్‌ చేస్తే ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నిలుస్తాడు.

3 / 5
విరాట్‌ కోహ్లీ సొంత టీమ్‌ నుంచే గట్టి పోటీ ఉంది. అది కూడా తన తర్వాత ఆర్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్ నుంచి. అయ్యర్‌ ఇప్పటి వరకు 4 మ్యాచ్‌ల్లో 195 పరుగులు చేశాడు. కోహ్లీ కంటే జస్ట్‌ 22 పరుగులు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. అవి దాటి ఆ తర్వాత మరిన్ని పరుగులు చేస్తే అయ్యర్‌ ఫస్ట్‌ ప్లేస్‌కి చేరే ఛాన్స్‌ ఉంది.

4 / 5
ఇక అయ్యర్‌ తర్వాత న్యూజిలాండ్‌ ఆటగాళ్లు టామ్‌ లాథమ్‌, కేన్‌ విలియమ్సన్‌ కూడా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి ప్లేస్‌ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లాథమ్‌ 193, విలియమ్సన్‌ 189 పరుగులతో ఉన్నారు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్‌లో కేన్‌ మామ సూపర్‌ సెంచరీతో మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. ఇండియాపై కూడా బాగా ఆడితే నంబర్‌ ప్లేస్ చేరుకుంటాడు.

5 / 5
లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌ టీమిండియా యంగ్‌ గన్‌ శుమ్‌మన్‌ కూడా ఈ లిస్ట్‌లో నేనున్నాను అంటున్నాడు. కానీ, గిల్‌ కచ్చితంగా ఫైనల్‌లో  సెంచరీ చేస్తేనే మిగతా అందర్నీ దాటుకొని ఫస్ట్‌ ప్లేస్‌కి వెళ్లే అవకాశం ఉంది. గిల్‌ సెంచరీ చేయడంతో పాటు రచిన్‌, కోహ్లీ లాంటి టాప్‌లో ఉన్న ఆటగాళ్లు తక్కువ స్కోర్‌కే పరిమితం అవ్వాలి. అప్పుడే గిల్‌ నంబర్‌ వన్‌ ప్లేస్‌కి వెళ్తాడు. వీరే కాకుండా రోహిత్‌ శర్మ లాంటి వాళ్లు ఏ డబుల్‌ సెంచరీ బాదేసి నంబర్‌ ప్లేస్‌లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎప్పుడు ఎవరు ఎలా ఆడతాడరో చెప్పలేం. అదే క్రికెట్‌లోని అసలు మజా. అయితే ఇప్పుడు చెప్పుకున్న వారికి అయితే ఎక్కువ అవకాశం ఉంది.