
ఆకర్షణీయ జంట.. భారతీయ క్రికెట్లో ప్రేమ జంటలకు కొదువ లేదు. అనేకమంది స్టార్ క్రికెటర్లు ప్రేమించి వివాహం చేసుకున్నవారు ఉన్నారు. వారిలో అత్యంత ఆకర్షణీయమైన జంటల్లో దినేష్, దీపిక జంట ఒకటి. వారి పరిచయం, ప్రేమ, వివాహం, పిల్లలు అంతా ఓ సినిమా కథలాగా ఉంటుంది. వారి ప్రేమ ప్రయాణంలో ఆసక్తికర అంశాలను చూస్తే..

రెండో పెళ్లి.. దీపిక నిజానికి దినేష్ రెండో భార్య!? నికిత అనే మహిళతో జరిగిన దినేష్ మొదటి వివాహం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల వారి బంధం 2012 తెగిపోయింది. ఆ తర్వాత ఆమె అదే సంవత్సరం మరో క్రికెటర్ మురళీ విజయ్‌ని వివాహం చేసుకుంది.

స్క్వాష్ క్రీడాకారిణి.. దినేష్ భార్య దీపిక మన దేశంలో ప్రముఖురాలే. మీరు స్పోర్ట్స్ బాగా ఫాలో అయ్యే వారు అయితే ఆమె పరిచయం అయ్యే ఉంటుంది. దీపిక పల్లికల్ జాతీయ స్థాయి స్క్వాష్ క్రీడాకారిణి. ఈ క్రీడలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించి అనేక ప్రశంసలు పొందింది.

తొలి పరిచయం.. దినేష్ దీపికను తొలిసారిగా 2012లో జిమ్‌లో కలిశాడు. అక్కడ వారిద్దరూ ఒకే కోచ్ వద్ద శిక్షణ పొందారు. అక్కడ వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రేమగా మారింది. 2013లో, ఒక టోర్నమెంట్ సమయంలో ఆమెను కలవడానికి భారతదేశం నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు వెళ్లాడు కూడా.

పెళ్లి సంబరం.. 2013లో, దినేష్ దీపికకు ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించిన తర్వాత, వారు కొంతకాలం తర్వాత నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే, వారి బిజీ స్పోర్ట్స్ కెరీర్ కారణంగా, వారి వివాహం రెండేళ్లపాటు వాయిదా వేయవలసి వచ్చింది.

హ్యాపీ ఫ్యామిలీ.. ప్రస్తుతం దినేష్ దీపికలకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ మగ పిల్లలే. పైగా కవలలు. ఇంకేమి కావాలి. వారిది సంతోషకరమైన కుంటుంబం. ప్రస్తుతం దినేష్ ఆర్సీబీ తరఫున మ్యాచ్ ఆడుతుంటే.. దీపిక డగౌట్ నుంచి ప్రోత్సహిస్తూ.. ఉత్సహాన్నిస్తోంది.