
టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా, ప్రియాంక రైనా కుమారుడు రియో జన్మదినోత్సం ఘనంగా జరిగింది.

మార్చి 23 రియో మొదటి బర్త్ డేను ఘనంగా నిర్వహించారు.ఈ సంర్భంగా ప్రత్యేక విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతోపాటు సమీప బంధువులు మాత్రమే హాజరయ్యారు.

పార్టీలో సురేష్ తన కుమారుడితో కేక్ కట్ చేయించాడు. రియోకు మీ శుభాకాంక్షలు , ఆశీర్వాదాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ పేర్కొన్నాడు.

రైనా సోషల్ మీడియాలో బర్త్ డే పార్టీ ఫోటోలను షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. రైనా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

ఐపీఎల్ 2020లో కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆడలేక పోయిన సురేష్ రై ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్ తరఫున ఆడనున్నాడు.