
గ్లెన్ ఫిలిప్స్ సూపర్ క్యాచ్.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు న్యూజిలాండ్ బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మలను వెంటవెంటనే అవుట్ చేశారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లీ రెండు ఫోర్లతో మంచి టచ్‌లో కనిపించినా.. పాయింట్‌లో గ్లెన్ ఫిలిప్స్ సూపర్ క్యాచ్ కింగ్ కోహ్లీని పెవిలియన్ చేర్చాడు. ఆ క్యా్‌చ్ చూసి కోహ్లీ కూడా షాక్ అయ్యాడు.

శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్.. ఈ మ్యాచ్‌లో 30 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పో్యింది. అయినా కూడా 249 పరుగుల ఫైటింగ్ టార్గెట్‌ను న్యూజిలాండ్ ముందు ఉంచిందంటే అందుకు ప్రధాన కారణం శ్రేయస్ అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్. గత కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడుతూ నిలకడ ప్రదర్శన కనబరుస్తున్న అయ్యర్.. మరోసారి టీమిండియాకు ఆపద్బాంధవుడిలా మారాడు.

భారత స్పిన్నర్లు.. ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం ఒకే ఒక్క స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌తో బరిలోకి దిగింది. హార్ధిక్ పాండ్యా మీడియం పేసర్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. మిగతా నలుగురు బౌలర్లు కూడా స్పిన్నర్లే. అందులో కుల్దీప్, వరుణ్ చక్రవర్తి క్వాలిటీ స్పిన్నర్లు, అక్షర్, జడేజా స్పిన్ ఆల్‌రౌండర్లుగా ఆడారు. ఇంత మంది స్పిన్నర్లు ఎందుకనే డౌట్ వచ్చింది కానీ, మ్యాచ్ 37.3 ఓవర్లు వేసిన స్పిన్నర్లు ఏకంగా 125 డాట్ బాల్స్ వేశారు. ఇన్ని డాట్స్ ఆడటంతో కివీస్‌కు రిక్వైర్డ్ రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది.

కేన్ మామ వికెట్.. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌లో వరుసగా వికెట్లు కోల్పోతున్నా కూడా ఒక ఎండ్‌లో ఆ జట్టు సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజ్‌లో పాతుకుపోయాడు. ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా.. మరీ స్లోగా ఆడాడు. 81 పరుగుల వద్ద అక్షర్ పటేల్ సూపర్ డెలవరీలో కేన్ మామను బోల్తా కొట్టించాడు. అక్షర్ బాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన కేన్ స్టంప్ అవుట్ అయ్యాడు. ఈ వికెట్‌తో మ్యాచ్ పూర్తిగా ఇండియా చేతుల్లోకి వచ్చేసింది. ఈ వికెట్ తీసినందుకు కోహ్లీ ఏకంగా అక్షర్ కాళ్లు మొక్కేశాడు.

వరుణ్ చక్రవర్తి కమ్‌బ్యాక్.. తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన హర్షిత్ రాణాను పక్కనపెట్టి ఈ సారి వరుణ్ చక్రవర్తిని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అది అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. వరుణ్ ఏకంగా 5 వికెట్ల హాల్‌తో అదరగొట్టాడు. అప్పుడెప్పుడో 2021 టీ20 వరల్డ్ కప్‌లో మిస్టరీ స్పిన్నర్‌గా బరిలోకి దిగి విఫలమైన వరుణ్.. మళ్లీ ఒక పెద్ద ఐసీసీ టోర్నీలో తన సత్తా ఏంటో చూపించాడు.