
ఉదయం ఆరోగ్యకరంగా ఉండేవి మాత్రమే తీసుకోవాలి ఏవి పడితే అవి తింటే అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. మీరు ఇప్పటి వరకు మినప అట్టుతో మెత్తగా చేయడం చూసారు. అయితే, ఈ సారి కొంచం కొత్తగా రుచిగా ఉండే పెసరపప్పు స్పాంజి దోసె ట్రై చేయండి. దీని కోసం మీరు బియ్యం వాడాల్సిన అవసరమే లేదు. ఈ దోసెలు మెత్తగా, స్పాంజిలా వస్తాయి. ఇంకా దీనిలో కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి వేయడం వలన మంచి రుచితో పాటు సువాసన కూడా వస్తుంది.

పెసర దోసెకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు పెసరపప్పు, కొద్దిగా అల్లం, నాలుగు పచ్చిమిర్చి,ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపదా ఉప్పు, రెండు కప్పుల పెరుగు, కొద్దిగా బేకింగ్ సోడా, రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగు, ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా కొద్దిగా నెయ్యి దోసెలు వేయడానికి సరిపడా తీసుకుంటే సరిపోతోంది.

పెసర దోసె తయారి విధానం : ముందుగా పెసరపప్పును కడిగి కనీసం 5 గంటలు పాటు బాగా నానాబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటి నుంచి నీరు వంపేసి ఆ తర్వాత మిక్సీలో పెసరపప్పు, కొద్దిగా అల్లం, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి నీరు పోస్తూ మెత్తని పిండిలా రుబ్బుకోవాలి అయితే, మరి మెత్తగా కాకుండా కొంచం బరకగా దీనిని పట్టుకోవాలి.

పెసర దోసె తయారి విధానం స్టెప్ 1 : ఇంకా ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, అర కట్ట కొత్తిమీర ఆకులు , ఒక కప్పు పెరుగు కూడా వేసి బాగా కలపండి. ఇలా 30 నిమిషాలు పాటు దీనిని మూతపెట్టి అలాగే ఉంచుకోవాలి. ఇంకా దోసె వేయడానికి 5 నిముషాలు ముందు బేకింగ్ సోడా కలిపితే ఈ అట్టు లు స్పాంజిలాగా వస్తాయి.

పెసర దోసె తయారి విధానం స్టెప్ 2 : ఇంకా వేడి పెనం మీద కొద్దిగా నూనె వేసి గరిటేతో పిండి వేసి దానిని కొంచం మందంగా తిప్పుకుని మూతపెట్టిమీడియం మంటపై 3 నిమిషాలు బాగా కలచుకోవాలి అంచుల చుట్టూ నూనె కానీ నెయ్యి వేసి తిప్పుకోవాలి. ఇంకా అవసరమైతే దీనిని రెండో వైపు కూడా తిప్పి కాల్చండి. అంతే వేడి వేడి పెసరపప్పు దోస రెడీ. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేదా పల్లీ చట్నీతో వడ్డించండి.