
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వాస్తు నియమాలను ఉల్లంఘించకూడదు అని చెబుతారు పండితులు. అయితే వివాహం ఆలస్యం అవుతున్నా లేదా వివాహం కుదిరినా పదే పదే పలు కారణాల వలన పెళ్లి వాయిదా పడుతున్నా వాస్తు కారణమే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. జాతకంలో ఎలాంటి సమస్యలు లేకపోయినా పదే పదే వివాహం ఆలస్యం అవుతుంటే తప్పకుండా వాస్తు చూపెట్టుకోవాలంట. కొన్ని రకాల తప్పుల వలన ఇలాంటి సమస్యలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట.

బెడ్ రూమ్ : చాలా మంది బెడ్ రూమ్ విషయంలో వాస్తు నియమాలను పాటించరు. కానీ బెడ్ రూమ్ దిశ తప్పుగా ఉన్నా, వివాహం చేసుకోబోయే అమ్మాయి లేదా అబ్బాయి, బెడ్ రూమ్ తప్పుడు దిశలో ఉండటంపై వాస్తు ప్రభావం చూపుతుందంట. వివాహం చేసుకోబోయే వారి బెడ్ రూమ్ ఈశాన్యం లేదా వాయువ్య దిశలో ఉంటే వివాహంలో ఆటంకాలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట. అందువలన ఈ విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

పూజ స్థలం : అలాగే పూజ స్థలం కూడా ఎప్పుడూ మురికిగా, చిందరవందరగా ఉండటం కూడా మంచిది కాదంట. ఇది ఇంటిలో ప్రతికూల శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా, జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. అందువలన పూజ గది ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

పెయింటింగ్స్ : కొంత మంది తమ ఇంటిలో అలంకరణ కోసం ఒంటరిగా లేదా విచారంగా ఉన్న పెయింటింగ్స్ పెడుతుంటారు. కానీ ఇలాంటివి ఇంటిలో ఉండటం మంచిదికాదంట, ఇది ఒంటరితనం, నిరాశకు కారణం అవుతుంది. కొన్ని సార్లు ఇవి కూడా మీ వివాహం పై ప్రభావం చూపే ఛాన్స్ ఉన్నదంట.

అలాగే కొంత మంది ఇంటిలో విరిగిన, పాడైన వస్తువులను అలాగే ఉంచుతుంటారు. కానీ ఎప్పుడూ అలాంటివి ఇంటిలో ఉండకూడదంట. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలోపల పాడైన, విరిగిన వస్తువుల, ఫర్నిచర్, పాత్రలు ఉండటం వలన ప్రతి కూల శక్తి పెరిగి, వివాహానికి ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంటుందంట.

వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు నిద్రపోతున్నప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం కనిపిస్తే, అది కూడా వాస్తు దోషానికి కారణమవుతుంది. అందుకే మీ బెడ్ ముందు అద్దం ఉండకూడదు. దీని వలన ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. అంతే కాకుండా వివాహానికి కూడా ఆలస్యం అవుతుంది. అందువలన వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్ రూమ్‌లో మంచానికి దగ్గరగా ఎప్పుడూ అద్దం ఉండకూడదంట.