Weekly Horoscope: వారికి ఆకస్మిక ధనలాభాలు, శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు

Edited By:

Updated on: Jun 27, 2026 | 1:04 PM

వార ఫలాలు (జూన్ 28-జూలై 4, 2026): మేష రాశి వారికి ఈ వారం ఊహించని అదృష్టాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి ధన ప్రవాహానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఊహించని మెరుగుదల ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం, అధికార యోగం పట్టే అవకాశముంది. కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): చతుర్థ స్థానంలో గురువు ఉచ్ఛస్థితి, శుక్ర, బుధులతో యుతి, ధన స్థానంలో రాశ్యధిపతి కుజుడి సంచారం వల్ల తప్పకుండా అన్ని విధాలా పురోగతి సాధిస్తారు. ఊహించని అదృష్టాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు బాగా సానుకూలంగా సాగుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. అనవసర ఖర్చులు పెరగడం గానీ, డబ్బు నష్టపోవడం కానీ జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): లాభ స్థానంలో శనీశ్వరుడు, ధన స్థానంలో రవి, తృతీయ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో గురు, బుధుల యుతి వల్ల ధన ప్రవాహానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఊహించని మెరుగుదల ఉంటుంది. రాశ్యధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల విలాసాలు, వినోదాల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరగడంతో పాటు, ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): రాశ్యధిపతి బుధుడు ధన స్థానంలో గురు, శుక్రులతో కలవడం వల్ల ధన ధాన్య సమృద్ధి యోగం కలిగింది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం, అధికార యోగం పట్టడం, కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది.  ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల పిల్లలు వృద్ధిలోకి రావడం, సంతానం లేని వారికి సంతాన యోగం కలగడం వంటివి జరిగే సూచనలున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసు లోని కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశిలో గురు, బుధ, శుక్రుల సంచారం, లాభ స్థానంలో కుజుడి స్థితి వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా ఆదాయపరంగా కూడా తప్పకుండా కొన్ని శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభవార్త అందుతుంది. వ్యయ స్థానంలో రవి సంచారం వల్ల వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో కొందరు మిత్రులు తప్పుదారి పట్టించడం జరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రాశ్యధిపతి రవి లాభ స్థానంలో, భాగ్యాధిపతి కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి రాజయోగాల పడతాయి. వృత్తి, ఉద్యోగాలకు గానీ, వ్యాపారాల్లో లాభాలకు గానీ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులు సైతం ఉద్యోగపరంగా స్థిరపడడం జరుగుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటుచేసుకుం టాయి. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆలయాల సందర్శనకు అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సామాన్యంగా సాగిపోతాయి.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): లాభస్థానంలో రాశ్యధిపతి బుధుడితో పాటు గురు, శుక్రులు కలిసి ఉండడం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్, వడ్డీ వ్యాపారాలు, షేర్లు వంటివి లాభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు చేకూరుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. సప్తమ స్థానంలో ఉన్న శని వల్ల ఆర్థికంగా కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యయ స్థానంలో ఉన్న కేతువు వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశినాథుడైన శుక్రుడు దశమంలో ఉచ్ఛ గురువుతోనూ, బుధుడితోనూ కలిసి ఉండడం, భాగ్య స్థానంలో రవి స్థితి వల్ల ఈ వారమంతా ఈ రాశివారికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి, శుభవార్తలు వినడానికి, శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి బాగా అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొద్దిగా ఖర్చు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. మాటకు, చేతకు విలువ పెరుగు తుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): సప్తమ స్థానంలో రాశ్యధిపతి కుజుడు, భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛ స్థితి వల్ల వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలతో పాటు, వ్యాపారాల్లో కూడా ఆర్థిక పరిస్థితిలో బాగా మెరుగుదల ఉంటుంది. అష్టమ స్థానంలో ప్రవేశించిన రవి కారణంగా కొన్ని రుణ సమస్యల నుంచి విముక్తి లభించడం, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. రాశ్యధిపతి కుజుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలోనూ, దాంపత్య జీవితంలోనూ సుఖ సంతోషాలకు లోటుండదు. అయితే, విలాసాలకు, వ్యసనాలకు, అనవసర పరిచయాలకు అవకాశం ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): సప్తమ స్థానంలో రవి, తృతీయంలో రాహువు, షష్ట స్థానంలో కుజుడి సంచారంతో పాటు రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల, ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడు తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. విదేశీ ఆఫర్లు, విదేశీ సంబంధాలు లభించే సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు సమసిపోవడంతో పాటు ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): తృతీయ స్థానంలో శని, సప్తమ స్థానంలో గురు, బుధ, శుక్రుల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. రాశినాథుడైన శని అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఆదాయానికి, ఆర్థిక పరిస్థితికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఆర్థిక సమస్యలను తగ్గించుకునే ప్రయత్నాలు సాగిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): పంచమ స్థానంలో రవి, షష్ట స్థానంలో శుభ గ్రహాల స్థితి వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరగడం, ఆదాయపరంగా బాగా కలిసి రావడం వంటివి జరుగుతాయి. అంతేకాక, వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఆస్తి వివాదాల విషయంలో శుభ వార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలకు అవకాశం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే సూచనలున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ద్వితీయంలో శని వల్ల ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాధారణంగా సాగిపోతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో సత్ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. బరువు బాధ్యతలు పెరగడం, విశ్రాంతి లేకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితంలో ఉత్సాహం పెరుగుతుంది.

Follow Us