పల్నాటి వీరారాధనోత్సవాలు.. నాలుగు రోజు ఉత్కంఠ భరితంగా కోడిపోరు.. !!

|

Dec 06, 2021 | 9:49 PM

పల్నాడు వీరారాధనోత్సవాలు ఉత్సాహాభరితంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజు కోడిపోరు జరిగింది.

1 / 6

2 / 6
మహాభారత యుద్దం జూదం కారణంగా జరిగితే పల్నాడు యుద్దానికి కోడిపోరే కారణం..  మాచర్ల, గురజాల రాజ్యాల మధ్య జరిగిన కోడిపందెంలో ఓడిపోయిన బ్రహ్మనాయుడు తమ రాజుతో అరణ్య వాసం చేయడం ఆ తర్వాత మాచర్ల రాజ్యం ఇవ్వడానికి నాగమ్మ ఒప్పుకోకపోవటంతో పల్నాటి యుద్దం జరిగింది.

3 / 6
ఈ యుద్దాన్ని గుర్తు చేసుకుంటూనే పల్నాటి వీరారాధనోత్సవాలు జరుపుకుంటారు. సాంప్రదాయ ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు కోడిపోరు నిర్వహిస్తారు.

4 / 6
మాచర్ల, గురజాల రాజ్యాలకు బదులుగా ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు హాజరవుతారు. మాచర్ల నుండి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాజరుకాగా గురజాల నుండి ఎమ్మెల్సీ జంగా. కృష్ణ మూర్తి విచ్చేశారు.

5 / 6
ఇద్దరు నేతలు తమ తమ కోళ్ళతో బరిలోకి దిగారు. ఈ ఉత్సవాన్ని కొణతాలు ధరించిన వీరాచారవంతులు ఆసక్తిగా తిలకించారు.

6 / 6
ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో చివరి రోజు కళ్ళిపాడు నిర్వహిస్తారు. దీంతో వీరారాధనోత్సవాలు ముగుస్తాయి. వివిధ ప్రాంతాల నుండి కారంపూడి చేరుకున్న వీరాచారవంతులు తమతమ కొణతముల పెట్టేలతో తిరుగు ప్రయాణమవుతారు.