Lucky Zodiac Signs: శుక్ర గ్రహానికి ఇష్టమైన రాశులివే.. అదృష్టం తలుపుతడుతోంది!

Edited By:

Updated on: Apr 23, 2026 | 4:08 PM

Shukra Blessings: భోగభాగ్యాలకు, సిరిసంపదలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్ర గ్రహానికి బలం పడితే తనకు ఇష్టమైన రాశులకు ఎన్నో అదృష్టాలనిస్తాడు. ఉచ్ఛ, స్వక్షేత్రాలలో సంచారం చేస్తున్నప్పుడు శుక్రుడికి బలం పెరుగుతుంది. ఈ బలం కొనసాగినంత కాలం శుక్రుడు తనకు స్వక్షేత్ర, మిత్ర రాశులైన వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులను వీలైనంతగా అందలాలు ఎక్కిస్తాడు. ఈ నెల(ఏప్రిల్) 20 నుంచి మే 14 వరకు తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఫలితాలనివ్వడం జరుగుతుంది. తనకిష్టమైన రాశులకు అదృష్టాన్ని కలిగించడం జరుగుతుంది.

1 / 6
వృషభం:  మే నెలలో వృషభ రాశివారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మూడు గ్రహాల కలయిక వీరిని కష్టాలను తెచ్చి పెట్టనుంది. మీరు ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయాలి. ఇంకా  ప్రతి అడుగులోనూ కొంచం కేర్ గా ఉండాలి. పని చేసే ఆఫీసులో సహోద్యోగులను మాటలను వినకండి. దీని వలన లేని పోనీ సమస్యలు వస్తాయి.

2 / 6
మిథునం: రాశ్యధిపతి బుధుడికి శుక్రుడు మిత్రుడైనందువల్ల ఈ రాశికి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ శుక్రుడు ఈ రాశివారికి అదృష్టాలు కలిగిస్తాడు. వృత్తి, ఉద్యోగాలరీత్యా వీరు విదేశాల్లో స్థిర పడే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి, ధన ధాన్య సమృద్ది యోగానికి బాగా అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి, సంపద కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, వడ్డీ వ్యాపా రాలు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలిస్తాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

3 / 6
కన్య: రాశ్యధిపతి బుధుడు మిత్రుడైనందువల్ల శుక్రుడు సిరిసంపదలను అనుగ్రహిస్తాడు. విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది. తప్పకుండా అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవనశైలి మారిపోతుంది. విలాస జీవితం అలవడుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, వ్యాపారంలో రాబడి పెరుగుతాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.

4 / 6
తుల:  మే నెలలో తులా రాశివారు పనిపై మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. పనికి రాని విషయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు పని లేకుండా పోతుంది ఇంకా మీ వైవాహిక జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి. ఇంకా చిన్న పొరపాటు కూడా పెద్దదిగా అవుతుంది. ఈ సమయంలో కుజుడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

5 / 6
మకరం: రాశినాథుడైన శనికి శుక్రుడు మిత్రుడైనందువల్ల ఈ రాశివారిని అనేక విధాలుగా అందలాలు ఎక్కిస్తాడు. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. విదేశాల్లో ఉద్యోగం లభించడం లేదా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. తల్లితండ్రుల వైపు నంచి సిరి సంపదలను అనుగ్రహిస్తాడు. కుటుంబంలో సుఖసంతోషాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపారంగా లాభిస్తాయి.

6 / 6
కుంభం: రాశ్యధిపతి శనికి శుక్రుడు మిత్రుడు అయినందువల్ల శుక్రుడి స్వక్షేత్ర ప్రవేశంతో ఈ రాశివారికి ధన యోగాలతో పాటు రాజయోగాలు కూడా కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు ఎక్కువగా వెళ్లడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై భూలాభం కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

Follow Us