
ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసుకోవడానికి తప్పకుండా చీపురును ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా దీని విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఇంటిలో దీనికి ప్రత్యేక స్థానాన్ని కేటాయించడం జరుగుతుంది.

ఇంటిలో చీపురు సరైన దిశలో పెట్టినప్పుడే అది మంచి ఫలితాలను ఇస్తుంది. అంతే కాకుండా ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నింపుతుంది అంటారు. అంతేకాకుండా చీపురు, ఆర్థిక పరిస్థితులను కూడా చక్కబెడుతుంది అంటారు. అందువలన దీనిని చాలా జాగ్రత్తగా ఉంచాలి అంటారు. ముఖ్యంగా మన పెద్దవారు చీపురు ఎప్పుడూ కూడా ఇంటికి వచ్చే అతిథులకు కనిపించడకుండా దాచి అంటారు. అయితే దీనికి గల కారణాలు ఏవో తెలుసుకుందాం.

చీపురును అందరికీ కనిపించేలా పెట్టకూడదు అంటారు. ఇలా ఉంచడం వలన ఇంటిలోకి ప్రతికూల శక్తి వస్తుందంట. అంతే కాకుండా, ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయి. అందువలన ఎప్పుడూ కూడా మీ ఇంటి చీపురు ఇంటికి వచ్చే వారికి కనిపించకుండా పెట్టాలని చెబుతుంటారు. ఇతరులు చూసే విధంగా చీపురు పెట్టడం వలన ఇది ఇంటిపై ప్రతి కూల ప్రభావాన్ని చూపుతుందంట. అంతే కాకుండా ఇంటి కుటుంబ సభ్యులు ఆరోగ్యం దెబ్బతింటుందంట.

అందువలన ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, చీపురును ఇంటిలో అందరికీ కనిపించకుండా పెట్టకూడదు అని మన పెద్దవారు చెబుతుంటారు. అంతే కాకుండా చీపరును తన్నడం, తొక్కడం వంటిది కూడా చేయకూడదంట. దీని వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి లోను అవుతుందంట. ఆ ఇంటిలో కలహాలు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంట. అందుకే చీపురును తన్నడం, తొక్కడం కూడా అస్సలే చేయకూడదంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు