
వాస్తు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంటిని నిర్మించినప్పటి నుంచి ఇంటి చుట్టూ ఏవైనా మొక్కలు, బరువైన ఫర్నిచర్ పెట్టే సమయంలో కూడా తప్పకుండా వాస్తు నియమాలు అనేవి చూస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కటీ కుటుంబంపై వాస్తు ప్రభావాన్ని చూపుతాయి. అయితే ఇప్పుడు ఇంటిలో కొబ్బరి చెట్టు ఉండటం పై వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

హిందూ సంప్రదాయాల ప్రకారం ఇంటిలో కొబ్బరి చెట్టు ఉండటం చాలా మంచిది. ఇది ఇంటికి శ్రేయస్సు, సంపదను తీసుకొస్తుందని చెబుతుంటారు పండితులు. అంతే కాకుండా ఎవరి ఇంటిలోనైతే కొబ్బరి చెట్టు ఉంటుందో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏ రంగంలో అయినా సరే మంచి పురోగతి ఉంటుందని చెబుతుంటారు వాస్తు శాస్త్ర పండితులు.

ముఖ్యంగా కొబ్బరి చెట్టును కల్పవృక్షం , కోరిన కోర్కెలు తీర్చే చెట్టు అని కూడా అంటారు. కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయ వస్తుంది. దీనిని ప్రతి పూజలో ఉపయోగిస్తారు. అందువలన ఈ చెట్టును చాలా పవిత్రమైన చెట్టు అంటారు, అలాగే కొబ్బరి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని, అందువలన ఎవరి ఇంటిలో అయితే సరైన దిశలో కొబ్బరి చెట్టు ఉంటుందో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.

అయితే ఇంట్లో కొబ్బరి చెట్టు ఉండటం మంచిదే అయినప్పటికీ, అది ఉండే స్థానం విషయంలో మాత్రం తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట. వాస్తు శాస్త్రం ప్రకారం, కొబ్బరి చెట్టు అనేది ఇంటి దక్షిణ, నైరుతి, పశ్చిమ , ఆగ్నేయ దిశలో ఉండటం చాలా శ్రేయస్కరం. ఈ దిశల్లో ఉంటేనే ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నెలకుంటుంది. అంతే కాకుండా కుటుంబంలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇంటిలోని వారికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది.

అయితే ఎవరి ఇంటిలో అయితే కొబ్బరి చెట్టు తూర్పు, ఉత్తర దిశలో ఉంటుందో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. మరీ ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం కొబ్బరి చెట్టుకు సూటిగా ఉండకూడదంట. అంతే కాకుండా ఇంటి మీద కొబ్బరి చెట్టు నీడ పడటం కూడా మంచిది కాదంట. అందువలన ఉదయం తొమ్మిది నుంచి, మధ్యాహ్నం మూడుగంటల మధ్య కొబ్బరి చెట్టు నీడ అనేది ఇంటి మీద పడకుండా చూసుకోవాలంట. లేకపోతే అనుకూల ఫలితాలు తగ్గిపోయి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు