
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంటి ముందు అస్సలు పెంచుకోకూడదంట. ఇవి ఇంట్లోని కుటుంబ సభ్యుల కెరీర్ పై ప్రభావం చూపడమే కాకుండా , మానసిక ప్రశాంతతపై కూడా దీని ప్రభావం ఉంటుందంట. కాగా, ఇప్పుడు మనం అసలు ఇంటి ముందు చింత పండు చెట్టు ఉండటం మంచిదా? కాదా? అనే విషయం తెలుసుకుందాం.

చాలా మంది ఇంటి ముందు పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు, పూల మొక్కలు పెంచుకుంటారు. అయితే ఇంటి ముందు మొక్కలు ఉండటం మంచిదే కానీ కొన్ని మొక్కలు తప్పుడు దిశలో ఉంటే, అది వాస్తు దోషానికి కారణం అవుతుందంట. దీని వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు దరి చేరే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ముందు లేదా ఇంటికి దగ్గర చింత చెట్టు ఉండటం అస్సలే మంచిది కాదంట. ఇది చాలా అశుభకరం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా ఎవరి ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చింత చెట్టు ఉంటుందో, వారు నిత్యం పేదరికంతో, ఇంట్లో కలహాలతో బాధపడుతూ ఉండటం ఖాయం అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ఎక్కువగా పెంచుతుందంట.

ఇంటికి దగ్గరగా చింత చెట్టు ఉండటం, ఇంటిపై చింత చెట్టు నీడ పడటం చాలా అశుభకరం. ఇది అనేక రకాల సమస్యలకు కారణం అవుతుందంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆవరణంలో చింత చెట్టు ఉండకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇంటి ముందు ఈ చెట్టు ఉండటం వలన ఆర్థిక నష్టాలు, అప్పుల పాలు అయ్యే ప్రమాదం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.