Vastu Tips: వంటిల్లే లక్ష్మీ, అన్నపూర్ణల నివాసం.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. దరిద్రం మిమ్మల్ని జీవితంలో వదిలిపోదు..

Updated on: May 20, 2025 | 2:22 PM

ఇంట్లో వంట గదికి ప్రత్యేక స్థానం ఉంది. లక్ష్మీ దేవితో పాటు అన్నపూర్ణ దేవి నివాసం ఉండే వంట గది నిర్మాణంలో మాత్రమే కాదు పరిశుభ్రత విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పెద్దలు చెబుతారు. వంటగదిలో చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంటికి ఆనందం, శ్రేయస్సును తీసుకురావచ్చు. అటువంటి వంట గది విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు.. ఇంట్లో వంట గదికి ప్రత్యేక స్థానం ఉంది. లక్ష్మీ దేవితో పాటు అన్నపూర్ణ దేవి నివాసం ఉండే వంట గది నిర్మాణంలో మాత్రమే కాదు పరిశుభ్రత విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పెద్దలు చెబుతారు. వంటగదిలో చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంటికి ఆనందం, శ్రేయస్సును తీసుకురావచ్చు. అటువంటి వంట గది విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు..

1 / 8
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిని సరైన దిశలో నిర్మించుకోవాలి. అంతేకాదు వంట గది పరిశుభ్రత , సరైన రంగుల ఎంపిక ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచడమే కాదు కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందాన్ని కూడా పెంచుతుంది.  కనుక వంట గది విషయంలో కొన్ని సాధారణ వాస్తు చిట్కాలను పాటిస్తే.. ఇంట్లో ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. వంటగదికి సంబంధించిన వాస్తు చిట్కాలు తెలుసుకోండి.. వీటిని పాటించడం వలన వంట గది అందంగా కూడా కనిపిస్తుంది.

2 / 8
రాత్రి సమయంలో ఆహారం వండిన పాత్రలను సింక్‌లో వదిలి నిద్రపోకండి. ఇలా చేయడం వలన రాహువు ప్రభావం కుటుంబ సభ్యులపై పడవచ్చు. ఇది వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పాత్రలు శుభ్రం చేసిన తర్వాత నిద్రపోవడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. మర్నాటి ఉదయాన్ని ప్రశాంతంగా మొదలు పెట్టవచ్చు.

3 / 8
 
చీపురు వంటగదిలో ఉంచకూడదు. ఎందుకంటే చీపురు ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. ఇంట్లో ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకుండా ఉండటానికి చీపురిని వంటగది వెలుపల ఉంచాలి. శుభ్రమైన,  సానుకూల వాతావరణం కోసం చీపురును వంటగది కి దూరంగా ఉంచాలి.

4 / 8
వంటగదిలో పాత్రలు కడగడానికి సింక్ లేదా నీటి వనరు ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. ఈ దిశ ఇంటికి తాజాదనాన్ని, శుభ్రతను తెస్తుంది. నీటి వనరు ఈ దిశలో ఉంటే ఇంట్లో శక్తి ప్రవాహం బాగుంటుంది.  కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు.

5 / 8
వంటగదిలో నల్లటి టైల్స్ ను ఉపయోగించవద్దు ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. తెలుపు, క్రీమ్ లేదా లేత నీలం వంటి లేత రంగు టైల్స్ ను ఉపయోగించడం మంచిది. ఈ రంగులు సానుకూల శక్తిని పెంపొందిస్తాయి. వంటగది వాతావరణాన్ని తేలికగా, ఉల్లాసంగా చేస్తాయి.

6 / 8

వాస్తు ప్రకారం వంటగది సింక్ కింద చెత్త లేదా చెత్తబుట్టను ఉంచడం సరైనది కాదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. ఇది కుటుంబ సభ్యులలో ఉద్రిక్తత, ఇబ్బందులకు కారణమవుతుంది. కనుక వంటగదిని శుభ్రంగా , క్రమబద్ధంగా ఉంచాలి.

7 / 8
 
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో వంట చేసే సమయంలో మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. ఈ దిశ సానుకూల శక్తితో నిండినదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో శాంతి, ఆనందం ఉంటాయి.

8 / 8
 
వంటగది వాతావరణాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా , చక్కగా ఉంచుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ స్టవ్‌ను మురికిగా ఉంచకూడదు. గ్యాస్ స్టవ్ మురికిగా ఉంటే.. అది ప్రతికూల శక్తిని కలిగిస్తుంది.  ఇది మొత్తం ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల గ్యాస్ స్టవ్ శుభ్రతపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.