
వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటిలో పదే పదే గాజు పాత్రలు, ఫొటో ఫ్రేమ్స్ కింద పడి పగిలిపోవడం అశుభసకేతం. ఇది మీ ఇంటిలో ప్రతి కూల శక్తి ఉందని సూచిస్తుందంట. అయితే ఇలా పదే పదే గాజు పాత్రలు పలిగి పోవడం ఇంటిలో ప్రతి కూల శక్తులు ఉండటాన్ని సూచిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

అదే విధంగా ఇంటిలోకి రాగానే ఊపిరి ఆడనట్లు అనిపించడం, ఇంటిలో ఎవరో ఉన్నట్లు అనిపించడం, ఎవరో మనల్ని గమనిస్తున్నట్లు అనిపించడం, సడెన్‌గా ఉల్కిపడటం, నిరంతం ఏ కారణం లేకుండా ఇంటిలో గొడవలు కూడా ప్రతి కూల శక్తులు ఉన్నాయని సూచించే, సంకేతాలు.

అలాగే వాస్తు వాస్త్రం ప్రకారం ఇంటిలో తలుపులు వాటంతట అవే సౌండ్ చేయడం, వస్తువులు కదలడం, విత శబ్దాలు వినిపించడం, వస్తువుల కింద పడిపోవడం వంటి సమస్యలు గనుక ఎదురు అయినట్లు అయితే మీ ఇంటిలో ప్రతికూల శక్తుల ప్రభావం ఉన్నట్లే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఇవే కాకుండా నిత్యం ఇంటిలోని వారి మధ్య గొడవలు, ఆర్థిక నష్టం, అనారోగ్య సమస్యలు, చిన్న పిల్లలు పదే పదే ఏడవడం, ఏ కారణం లేకుండా ఇంటిలో గొడవలు జరగడం వంటి సమస్యలు కూడా ఇంటిలో ప్రతి కూల శక్తులు ఉన్నాయని సూచిస్తాయని చెబుతున్నారు నిపుణులు.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు