
ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో మణికర్ణిక ఘాట్.. ఇక్కడ ఇప్పటికీ క్షుద్రపూజలు జరుగుతాయంట. యూపీలోని బోజ్ పూర్ పూర్వాంచల్ ప్రాంతంలో గంగానది ఒడ్డున ఒక పురాతన నగరం ఉంది. అక్కడ ఒక శ్మశానవాటిక కూడా ఉన్నదంట. ఇప్పటికీ ఆ ప్రదేశలో తంత్ర, మంత్రం, చేతబడి వంటి ఆచారాలకు ప్రసిద్ధి చెందినది ఆ నగరం అని చెబుతుంటారు కొందరు.

అస్సాం, కామాఖ్య ఆలయం.. అస్సాలంలోని గౌహతిలో ఉన్న కామాఖ్య ఆలయం తాంత్రిక ఆచారాలకు ప్రసిద్ధి చెందినది. ఇక్కడికి నిత్యం వేలమంది తాంత్రికులు వచ్చి నిత్యం పూజలు చేస్తారంట. దీనిని ఒక రహస్య, శక్తివంతమైన ఆలయంగా పరిగణిస్తారు.

కోల్ కత్తా, నిమ్తాలా ఘాట్, ఇక్కడ నిత్యం క్షుద్రపూజలు జరుగుతాయంట. ముఖ్యంగా అంత్యక్రియలకు, తాంత్రిక పూజలకు ఇది అనువైన ప్రదేశం. ఇక్కడ చాలా మంది అఘోరీలు కనిపిస్తారంట. ముఖ్యంగా రాత్రి అయితే చాలు అటు వైపు వెళ్లాలి అంటే భయపడిపోతారని చెబుతుంటారు అక్కడి వారు.

ఒడిశా, కుసభద్ర నది ఘాట్ .. ఒడిశాలోని కుసభద్ర నది ఒడ్డున నిత్యం తాంత్రిక ఆచారాలు జరుగుతాయంట. ముఖ్యంగా ఈ నది ఒడ్డు క్షుద్ర విద్యకు చాలా ప్రసిద్ధి అని చెబుతుంటారు. చాలా భయానకమైన ప్రదేశంలో ఇదొక్కటి, చాలా మంది ఈ ప్రదేశం వైపు వెళ్లాలి అంటే వణికిపోతారంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు