
ఫిబ్రవరిలో శుక్ర గ్రహం, బుధ గ్రహం రెండూ ఒకే రాశిలో సంచారం చేయనున్నాయి. దీని వలన రెండు గ్రహాల కలయికతో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది వృషభ రాశి, కుంభ రాశి, సింహ రాశి, మిథున రాశి వారికి అన్ని విధాల లక్కు తీసుకొస్తుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో లక్ష్మీనారాయణ రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

వృషభ రాశి : వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వీరికి అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్ర గ్రహం అనుగ్రహం వలన వీరికి సంపద పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా కళా రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు అందుకుంటారు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అనుకున్న పనులన్నీ సమయానుగుణంగా పూర్తి చేస్తారు.

సింహ రాశి : సింహ రాశి వారికి చాలా రోజుల నుంచి తీరని కోర్కెలు వీరు ఈ సమయంలో తీర్చుకుంటారు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. కార్యాలయాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. అద్భుతమైన ప్రయోజనాలు అందనున్నాయి.

మిథున రాశి : మిథున రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవిస్తారు. లక్ష్మీనారాయణ రాజయోగం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. నిలిచి పోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. వ్యాపారస్తులు పెట్టుబడుల ద్వారా ఎక్కువ లాభాలు పొందుతారు. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.