
కొత్త సంవత్సరంలో ఇంటిలో ఆనందాలు వెల్లివెరియాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మహిళలు తప్పకుండా కొన్ని పనులు చేయాలంట, దీని వలన ఇంటిలో సంపద పెరగడమే కాకుండా సంవత్సరం మొత్తం లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. అనుకున్న పనులన్నీ సరైన సమయానికి పూర్తి అవుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

కొత్త సంవత్సరం మొదటి రోజు మహిళ తప్పకుండా ఇంటిముందు అందంగా ముగ్గులు వేసి, తులసి చెట్టును పూజించి, దానికి ఎరుపు రంగు దారం కట్టాలంట. అంతే కాకుండా తులసి పూజ చేస్తూ, విష్ణు మంత్రాలు జపించాలి. దీని వలన ఇంటిలో సంపద పెరుగుతుందంట. ఆరోగ్యపరంగా, ధన పరంగా కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు.

సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం : కొత్త సంవత్సరం మొదటి రోజు ఏ గృహిణి అయితే ఉదయాన్నే బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేచి, గంగాజలంతో స్నానం చేసి, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తారో, వారి ఇంట ఆనందాలు నెలకొంటాయంట. అంతే కాకుండా వారిపై సూర్య భగవానుడి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం సంవత్సరం మొత్తం ఉంటుందంట.

నూతన సంవత్సరం దంపతులు ఇంటి పెద్దవారి నుంచి ఆశీర్వాదం పొందాలి. అలాగే తమ పిల్లలకు కూడా ఆశీర్వచనం ఇవ్వాలంట. దీని వలన పెద్దల ఆశీర్వాదం, భగవంతుడి చల్లని చూపు మీ పై ఉండి, మీకు లోటు రాకుండా చూస్తాడంట. అంతే కాకుండా పెద్దలను గౌరవించే చోట ధనానికి లోటే ఉండదంట.

అలాగే 2026 సంవత్సరం మొదటి రోజున ఇష్టదైవాన్ని పూజించాలి. ముఖ్యంగా ఈ రోజు వినాయకుడిని పూజించి, శివ పూజ చేయడం, అలాగే, మీ చేతులతో స్వయంగా స్వీట్ తయారు చేసి దేవుడికి నైవేద్యం సమర్పించడం, ఆవుకు ఆహారం ఇవ్వడం చాలా శుభప్రదం.