Shakti Peethas: తెలుగు రాష్ట్రాల్లో విలసిల్లుతున్న శక్తి పీఠాలు ఇవే.. ఎక్కడ ఉన్నాయంటే.?

Updated on: Jun 22, 2025 | 7:40 AM

అష్టాదశ శక్తి పీఠాలు గురించి మీరు వినే ఉంటారు. వాటిలో కొన్ని చూసి కూడా ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో నాలుగు శక్తి పీఠాలు ఉన్నాయి. వాటిని ఏటా చాలామంది దర్శనం చేసుకొంటున్నారు. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పూజలందుకుంటున్న అమ్మవారి శక్తి పీఠాలు ఏంటి.? ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి..

1 / 5
దక్షయజ్ఞంలో అగ్నిలో దూకిన సతీదేవి శరీరాన్ని చేతుల్లో పట్టుకొని విలపిస్తూ పరమశివుడు భారత ఖండం అంత తిరుగుతున్న సమయంలో  ఆ జన్మంతా శరీర భాగాలు ఒక్కోచోట పడతాయి. అవే అష్టాదశ శక్తి పీఠాలగా వెలిసాయి. నిజానికి ఇవి మొత్తం 108. వాటిలో అతి ముఖ్యమైన 18 ఉన్నాయి. వాటిలో నాలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.

2 / 5
భ్రమరాంబిక ఆలయం కూడా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇది నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో ఉంది. ఇది ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం. అప్పట్లో ఆధ్యాత్మిక గురువు ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని సందర్శించారని, ఇక్కడ శివానంద లహరిని రచించారని చెబుతారు.

3 / 5
పురుహూతిక దేవి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉంది. కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించగానే మనకు పాదగయ సరోవరం అని పిలువబడే ఒక కొలను కనిపిస్తుంది. ఇక్కడ పితృదేవతల పూజలు చేస్తారు.

4 / 5
మాణిక్యాంబ దేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇది కోనసీమ జిల్లాలోనూ ద్రాక్షారామంలో ఈ దేవి కొలువై ఉంది. ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు ఆరామ క్షేత్రాలలో ఒకటి. మిగిలిన నాలుగు కుమారరామ, క్షీరారామ, భీమారామ, అమరారామ ఆలయాలు.

5 / 5
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శక్తి పీఠాల్లో ఒకటి అలంపూర్ జోగులాంబ ఆలయం. ఇది తెలంగాణాలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. ఈ శక్తి పీఠం పాత దేవాలయం 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులచే ధ్వంసం చేయబడింది. ఆమె రెండు శక్తి చండి, ముండి విగ్రహాలు రక్షించబడ్డాయి.