
హిందూ సంప్రదాయం ప్రకారం, ఏ పని చేసినా శుభ ముహుర్తాలు చూడటం కామన్. ముఖ్యంగా వివాహాల కోసం తప్పకుండా, తిథి మాసం, శుభ సమయం, మంచి రోజు ఇలా అన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అయితే డిసెంబర్ నెలలో మూఢం ఉండటం వలన కొన్ని రోజుల పాటు శుభకార్యాలకు మంచి ముహుర్తాలు ఉండవు. కొన్ని రోజుల పాటు అసలు శుభకార్యాలే జరుపుకోరు.

ఈ సమయంలో ప్రేమ, వివాహం వాటితో ముడిపడి ఉన్న శుక్ర గ్రహం చాలా బలహీనంగా ఉంటుంది. అందువలన వివాహాలకు ఇది మంచి సమయం. కాదు, అయితే డిసెంబర్ నెల పూర్తి అయ్యి, జనవరి రాబోతుంది. 2026 కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది జనవరిలో వివాహ ముహుర్తాలు ఉన్నాయా అని ఆశగా ఎదురు చూస్తుంటారు. అయితే వారి కోసమే ఈ సమాచారం.

చాలా వరకు జనవరి 15 తర్వాత శుభ ముహూర్తాలు ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం జనవరిలో కూడా మూఢం ఉండటం వలన ఈ సమయంలో శుభ ముహుర్తాలు లేవంట. శుక్రుడు 53 రోజులు దహన స్థితిలో ఉంటాడు. ఫిబ్రవరిలో మాత్రమే కనిపిస్తాడు. అందువలన జనవరి నెల మొత్తం వివాహాలకు అనుకూలంగా ఉండదంట.

శుక్ర గ్రహం మళ్లీ ఎప్పుడు ఉదయిస్తుందో, అప్పుడే శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతాయంట. అంటే జనవరి నెల మొత్తం ఎలాంటి శుభ సమయాలు లేవు, ఫిబ్రవరి నెల చివరలో మాత్రమే వివాహాలకు అద్భుతంగా ఉన్నదంట. అందువలన వివాహం చేసుకోవాలి అనుకునే వారు ఫిబ్రవరి వరకు వేచి చూడాల్సిందే.

పంచాంగం ప్రకారం , ఫిబ్రవరి నెలలో 12 శుభ వివాహ ముహూర్తాలు ఉన్నాయంట. అందులో ఫిబ్రవరి 20, ఉత్తర భాద్రపద, తిథి తృతీయ , శుక్ర వారం వివాహానికి మంచి రోజు. అదే విధంగా ఫిబ్రవరి 24, మంగళ వారం, ఫిబ్రవరి 25, బుధ వారం, ఫిబ్రవరి 26 గురువారం, ఫిబ్రవరి 27 శుక్రవారం వివాహాలకు మంచి సమయం. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదంట.