Unique Temples: ఈ ఆలయాల్లో పురుషులకు నో ఎంట్రీ.. వెళ్తే భార్యాభర్తల బంధంలో గొడవలే..

Updated on: Apr 11, 2025 | 8:29 PM

భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇది శతాబ్దాల నాటి సనాతన ధర్మ సంప్రదాయంనికి సజీవ సాక్షాలు. అవి అనాది కాలం నుంచి వస్తున్న నియమాలు, సంప్రదాయాల ప్రకారం వెళ్తాయి. అయితే కొన్ని ఆలయాలలోకి స్త్రీల ప్రవేశం నిషేధం ఉన్నట్లే.. కొన్ని ఆలయాల్లో వివిధ కారణాల వల్ల పురుషులు ప్రవేశించకుండా నిషేధించబడ్డారు. పురుషులు ప్రవేశించడానికి అనుమతి లేని దేవాలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

1 / 7
బ్రహ్మ దేవుడి ఆలయం, ఖజురహో, మధ్యప్రదేశ్: బ్రహ్మ దేవుడి ఆలయం దాని ప్రత్యేకమైన సంప్రదాయంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడ వివాహిత స్త్రీలు మాత్రమే గర్భగుడిలోకి ప్రవేశించి దేవునికి పూజలు చేయడానికి అనుమతి ఉంది.

2 / 7
బ్రహ్మ ఆలయం, పుష్కర్, రాజస్థాన్: ఈ బ్రహ్మ ఆలయంలో వివాహిత పురుషులు ప్రవేశించడాన్ని ఒక పురాణం కారణంగా నిషేధించారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా బ్రహ్మదేవుడిని పూజిస్తూ ఒక వార్షిక ఉత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మ గాయత్రి దేవిని వివాహం చేసుకుంటాడు. ఇది సరస్వతి దేవి కోపాన్ని తెప్పించింది. దీంతో సరస్వతి దేవి వివాహిత పురుషులు ఈ ఆలయంలోకి అడుగు పెట్టి పూజలు చేస్తే వారి వైవాహిక జీవితానికి ఇబ్బంది కలుగుతుందని ఈ ఆలయాన్ని శపించిందట. దీంతో ఈ ఆలయ గర్భగుడిలోకి పురుషుల ప్రవేశించకుండా నిషేధం ఉంది.

3 / 7
తమిళనాడులోని కుమారి అమ్మన్ ఆలయం: తమిళనాడులోని కన్యాకుమారి ఆలయం పార్వతి దేవి అవతారమైన కన్యాకుమారికి అంకితం చేయబడిన ఆలయం. పురుషులు, ముఖ్యంగా వివాహిత పురుషులకు దేవత విగ్రహం ఉన్న గర్భ గుడిలోపలికి అనుమతిలేదు. మహిళలు మాత్రమే అక్కడ దేవతను నేరుగా పూజించగలరు. ఆలయ సంప్రదాయాలు, నియమాల ప్రకారం సన్యాసులు ఆలయ ద్వారం వద్ద నుంచి మాత్రమే సందర్శించవచ్చని ..  వివాహిత పురుషులు దూరం నుండి ప్రార్థనలు చేయవచ్చని చెబుతారు.

4 / 7
సంతోషి మాత ఆలయం, జోధ్పూర్: జోధ్‌పూర్ నగరంలో పురుషులను లోపలికి అనుమతించని సంతోషి మాత ఆలయం ఉంది. శుక్రవారం సంతోషి మాతకు అంకితం చేబయడిన రోజు. కనుక ఈ రోజున మహిళలు శాంతి సుఖాలను కోరుతూ అమ్మవారిని దర్శించుకుంటారు. శుక్రవారాల్లో ఆలయ శక్తి పెరుగుతుందని కుటుంబ సామరస్యం, ఆనందం కోసం అమ్మవారిని మహిళల దర్శించుకుని పూజలు చేస్తారు. ఈ సమయంలో, లోపలి గర్భగుడిలోకి పురుషులను అనుమతించరు.

5 / 7
కామాఖ్య ఆలయం, అస్సాం: భారతదేశంలోని ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటి. కామాఖ్య దేవాలయం అస్సాంలోని గౌహతిలో నీలాచల్ కొండపై ఉంది. ఈ ఆలయంలో కామాఖ్య దేవి కి ప్రతి సంవత్సరం అంబుబాచి మేళాను నిర్వహిస్తారు. ఈ సమయమలో ఆలయం మూడు రోజులు మూసివేయబడుతుంది. ఆ కాలంలో పురుషులను ప్రవేశించడానికి అనుమతి లేదు.

6 / 7
చక్కులతుకావు ఆలయం, కేరళ: ఈ ఆలయం దుర్గాదేవికి అంకితం చేయబడింది. చక్కులతుకావు ఆలయం డిసెంబర్ మొదటి శుక్రవారం నాడు జరిగే వార్షిక ప్రధాన పూజ 'నారి పూజ'కు ప్రసిద్ధి చెందింది. ఏటా జరిగే 'నారి పూజ' పండుగలో, పురుషులు ఆలయ ప్రాంతంలోకి ప్రవేశించలేరు. ఇది మహిళలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇక్కడ పూజారులు మహిళా భక్తుల పాదాలను కడుగుతారు. ఇక్కడ పురుషులకు అనుమతి లేదు. మహిళలు అదృష్టం, ఆరోగ్యం కోసం అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఇక్కడికి వస్తారు.

7 / 7
అట్టుకల్ భగవతి ఆలయం, కేరళ: అట్టుకల్ భగవతి ఆలయాన్ని మహిళల శబరిమల అని కూడా అంటారు. అట్టుకల్ పొంగళ పండుగ సందర్భంగా, లక్షలాది మంది మహిళలు ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు భారీ  సంఖ్యలో చేరుకునే అతిపెద్ద వార్షిక వేడుకగా ఈ ప్రదేశం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌కి ఎక్కింది. అట్టుకల్ పొంగళ పండుగ సమయంలో, పురుషులను ఆలయ ప్రాంగణంలోకి అనుమతించరు.