Money Astrology: త్రిగ్రాహి యోగంతో వీరికి డబ్బే డబ్బు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

Edited By:

Updated on: Oct 15, 2026 | 7:37 PM

Trigrahi Yoga: ఈ నెల(అక్టోబర్) 17న రవి గ్రహం తులా రాశి ప్రవేశం చాలా శుభప్రదంగా, యోగదాయకంగా ఉండబోతోంది. రవి ఇక్కడ నీచబడుతున్నప్పటికీ, తులా రాశి అధిపతి శుక్రుడు అదే రాశిలో ఉండడం వల్ల రవికి నీచభంగం కలిగింది. రవి ఈ రాశిలో ఉన్నంత కాలం అంటే, నవంబర్ 17 వరకు బుధ, శుక్రులతో యుతి జరుగుతున్నందువల్ల తులా రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. దీనివల్ల కొన్ని రాశులవారికి అనేక విధాలైన ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరు రాశులకు ధన యోగాలు, అధికార యోగాలు, సామాజిక హోదాలు పట్టబోతున్నాయి. మిథునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశులకు ఇది యోగప్రదంగా ఉంటుంది.

1 / 6
మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర, బుధ, రవుల సంచారం అనేక విధాలుగా యోగప్రదంగా ఉండబోతోంది. ఉద్యోగంలో హోదా, స్థాయి పెరుగుతాయి. అంచనాలకు మించి జీతభత్యాలు పెరిగే అవ కాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడి రాబడి బాగా వృద్ధి చెందు తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. భారీయెత్తున వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో మూడు శుభ గ్రహాల సంచారం జరగుతున్నందువల్ల జీవితంలో కొన్ని అనూహ్య శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజకీయాలు, ప్రభుత్వం, ప్రజా సంబంధాలు, సామాజిక రంగాల్లో ఉన్నవారికి ఆదాయం బాగా పెరగడంతో పాటు అధికార యోగం పడుతుంది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా తప్పకుండా సఫలం అవుతుంది. కెరీర్ పరంగా, ఆర్థిక పరంగా అంచనాలకు మించిన స్థిరత్వం ఏర్పడుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి.

3 / 6
కన్య: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడు రవి, శుక్రులతో యుతి చెందడం వల్ల ఏ రంగంలోని వారికైనా తప్పకుండా అధికార యోగం పట్టి ఉన్నత స్థానాలు లభిస్తాయి. ఆర్థికంగా కూడా బాగా ఉచ్ఛ స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశముంది. విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్న వారు స్థిరత్వం పొందుతారు. తండ్రి వైపు నుంచి విలువైన ఆస్తి సంక్రమించే సూచనలున్నాయి.

4 / 6
తుల: ఈ రాశిలో మూడు శుభ గ్రహాలు సంచారం చేస్తుండడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశముంటుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అంది వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి ఖాయమవుతుంది. సహో ద్యోగితో ప్రేమలో పడే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వచ్చే అవకాశం ఉంది.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో బుధ, శుక్ర, రవి గ్రహాలు కలవడం వల్ల రాజకీయ ప్రాబల్యం కలుగు తుంది. ఉన్నత వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్, షేర్లు వంటివి బాగా లాభాలనిస్తాయి. సర్వత్రా ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

6 / 6
మకరం: ఈ రాశికి దశమంలో బుధ, శుక్ర, రవులు కలవడం వల్ల ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అత్యుత్తమ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. ఆర్థికంగా అదృష్టం పడుతుంది. ముఖ్యంగా ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. ప్రమోషన్లు, భారీ జీతభత్యాలతో కూడిన బదిలీకి అవకాశం ఉంది. ఇంటా బయటా ప్రాభవం పెరుగుతుంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us