
మేష రాశి : వీరికి సూర్యుడి సంచారం వలన చాలా అద్భుతంగా ఉంటుంది. పట్టింది బంగారమే అవుతుంది. సూర్యుడు కన్య రాశిలోకి సంచారం చేయడం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. కుటుంబంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం చేయడం వలన పనుల్లో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి. అంతే కాకుండా ఆర్థికంగా వీరికి కలిసి వస్తుంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ప్రతి పనిలో విజయం వీరిని వరిస్తుంది. ఆర్థికంగా ఆరోగ్య పరంగా అన్ని విధాలుగు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మీన రాశి : మీన రాశి వారికి సూర్యుడి సంచారం వలన పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశిలోని కొందరు తమ చిన్ననాటి స్నేహితులను కలుసుకొని చాలా ఆనదంగా ఉండే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా చాలా అద్భతంగా కలిసి వస్తుంది.

మిథున రాశి : మిథున రాశి వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. ఆదాయం త్రిబుల్ అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం లభించక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఇది చాలా మంచి సమయం. ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. ఆర్థికంగా ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా కూడా వీరికి పట్టింది బంగారమే కానుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు