
శ్రావణ మాసం వచ్చేసింది. అయితే ఈ సమయంలో ప్రతి సోమవారం శివుడికి ఇష్టమైన పత్రాలు, పూలతో పూజించాలి అంట. దీని వలన జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలిగిపోవడమే కాకుండా, సానుకూలత పెరుగుతుందంట. ముఖ్యంగా ఎవరు అయితే జాతకంలో గురుడు బలహీనంగా ఉండి సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి.

జాతకంలో గురు గ్రహం బలం బలపరచుకోవడానికి శివుడిని పూజించిన తర్వాత నుదిటి పై పసుపు లేదా కుంకుమ పువ్వుతో తిలకం పెట్టుకోవాలంట. ఇలా శ్రావణ మాసం ప్రతి సోమవారం చేయడం వలన జాతకంలో గురు గ్రహం బలపడుతుంది. సకల సంతోషాలు కలుగుతాయి.

అదే విధంగా ఉదయం స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. పాలతో అభిషేకం చేసి, కుంకుమ పువ్వు సమర్పించాలి. అలాగే హారి ఇచ్చి, మిఠాయి సమర్పించాలి. ఇలా శ్రావణ మాసం మొత్తం విష్ణుమూర్తిని ఆరాధించడం పూజించడం వలన గురు బలం పెరుగుతుందంట.

అంతే కాకుండా పసుపు రంగు వస్తువులు దానం చేయడం, సోమవారం శుక్రవారం ఆలయాలను సందర్శించడం, నిత్యం దైవారాధాన దీపారాధన చేయడం వలన పేదలకు వస్త్రాలు దానం చేయడం, తల్లిదండ్రులను, పెద్దలను, ఉపాధ్యాయులను గౌరవించడం వలన కూడా జాతకంలో గురుడు బలపడటానికి సహాయపడుతుందంట

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు