శ్రీశైలంలో దసరా మహోత్సవం.. స్కందమాత అలంకారంలో భ్రమరాంబికాదేవి దర్శనం!

Edited By:

Updated on: Oct 16, 2026 | 10:22 AM

Srisailam Navratri: నంద్యాల జిల్లా శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు భ్రమరాంబికాదేవి స్కందమాత అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, స్వామి అమ్మవార్లను శేష వాహనంపై గ్రామోత్సవానికి బయలుదేరారు. నాదస్వరం, కొమ్ము కోయ నృత్యం, కోలాటం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కర్పూర నీరాజనాలర్పించారు.

1 / 5
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదోవ రోజు భ్రమరాంబికాదేవి స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

2 / 5
ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి.. బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు.

3 / 5
శ్రీ భ్రమరాంబికాదేవి స్కందమాత అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు శేష వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చరు.

4 / 5
అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు నాదస్వరం,కేరళ చండీ మేళం, కొమ్ము కోయ నృత్యం,కోలాటం,  రాజభటుల వేషాలు,వివిద రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

5 / 5
ఆలయం లోపలి నుంచి బాజా బజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ‌ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా.. కదలివస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు,అధికారులు పాల్గొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us