రేపే సూర్య గ్రహణం.. సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసుకోండి!

Updated on: Feb 16, 2026 | 4:06 PM

సూర్య గ్రహణం, చంద్రగ్రహణాలను ఏర్పడటం కామన్. ఇక 2026లో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17 మంగళ వారం రోజున ఏర్పడ నుంది. శాస్త్ర వేత్తలు దీనిని ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యంగా చెబుతున్నారు. ఎందుకంటే? ఈ సూర్య గ్రహణం, సమయంలో సూర్యుడు రింగ్ ఆకారంలో, అగ్ని వలయంగా కనిపిస్తాడు. కాగా, ఇప్పుడు మనం సూర్య గ్రహణం సమయం, భారతదేశంలో కనిపిస్తుందా? సూతక కాలం గురించి తెలుసుకుందాం.

1 / 5
 సూర్య గ్రహణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే  సూర్య గ్రహణం అనేది, భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు  సూర్యుడు కొంత భాగం లేదా పాక్షికంగా కొద్ది సేపు కనిపించడు. దీనినే సూర్య గ్రహణం అంటారు. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉండటమే కాకుండా, వ్యక్తుల జీవితాలపై కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా గ్రహణ ప్రభావం వలన కొన్ని రాశుల వారికి మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు తలెత్తుతుంటాయి.

2 / 5
అయితే భారత దేశంలో ఈ సూర్య గ్రహణం కనిపిస్తుందా? ఫిబ్రవరి 17న ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గున అమావాస్య రోజున గ్రహణం ఏర్పడనుంది. దాదాపు  ఇది రెండు నిమిషాల 20 సెకన్ల పాటు ఉంటుంది. యూటీసీ నివేదిక ప్రకారం.. ఉదయం 7 : 01 గంటలకు ప్రారంభం, అంటే భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 : 31 గంటలకు ఇది ఏర్పడుతుంది.

3 / 5
ఈ సూర్య గ్రహణం అగ్నివలయం ఆకారంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గ్రహణం ఎక్కువగా అంటార్కిటికాలో కనిస్తుంది. తర్వాత దక్షిణ ఆఫ్రికా, చిలీ, అర్జెంటీనాలో కనిపిస్తుంది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు. చాలా మంది అగ్ని వలయ సూర్య గ్రహణాన్ని చూడాలని అనుకుంటే మాత్రం వారికి నిరాశే అని చెప్పాలి. ఈ గ్రహణం వార్షిక దశ భారత్‌లో కనిపించదు, కొన్ని ప్రాంతాలలో మాత్రం పాక్షిక సూర్య గ్రహణాన్ని చూడ వచ్చును.

4 / 5
సూతక కాలం ప్రారంభం :  జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, సూర్య గ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో మతపరమైన ఆచారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కొత్త బట్టలు ధరించడం, గోర్లు తీయడం, జుట్టు కత్తిరించుకోవడం, శుభకార్యాలు జరపడం మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us