
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలు సహజం. అయితే సెప్టెంబర్ శని, శుక్ర గ్రహాల వలన షడాష్ట యోగం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 1.51 గంటలకు ఈ యోగం ఏర్పడుతుంది. దీని వలన మూడు రాశుల వారు అనేక సమస్యలు ఎదుర్కోగా, మరో మూడు రాశుల వారికి ఇది అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మేష రాశి : మేష రాశి వారికి షడాష్టక రాజయోగం వలన అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటిలో సానుకూల వాతావరణం నెలకుంటుంది. అంతే కాకుండా కోర్టు వ్యవహారాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా వస్తాయి. సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది.

కన్యా రాశి : శ్రీకృష్ణుడి అనుగ్రహం వలన కన్యా రాశి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకుంటారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఈ యోగం వలన పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే అవుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం కూడా చాలా పెరుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు