
ఖగోళ వింత చంద్రగ్రహణం ఈ సంవత్సరం ఆగస్టు 28న ఏర్పడనుంది. అయితే ఇది భారత్‌లో కనిపించదు. అందువలన సూతక కాలం కూడా వర్తించదు. అయినప్పటికీ ఇది పన్నెండు రాశులను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా నాలుగు రాశుల వారు ఎవరి మాట పట్టించుకోకుండా, అనుకోని నిర్ణయాలు తీసుకొని ఇబ్బందుల్లో చిక్కుకుంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మేష రాశి : మేష రాశి వారు ఈ గ్రహణం సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కానీ వీరు చాలా సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలే వీరి జీవితాన్ని గందరగోళంలో పడేస్తాయి. అందువలన ఈ రాశి వారు గ్రహణ సమయంలో పూర్తి అయ్యే వరకు ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి : మిథున రాశి వారికి అవమానాలు, అపనిందలు, మాట పట్టింపులు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అందువలన వీరు మానసికంగా చాలా ధృఢంగా ఉండాలి. ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తుంది. ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితులు ఎదురు కావచ్చును. కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.

సింహ రాశి : సింహ రాశి వారికి వీరి అహంకారమే వీరిని నాశనం చేస్తుంది. మంచిగా ఉండే భవిష్యత్తును వీరు తమ చేతిలతో నాశనం చేసుకుంటారు. ముఖ్యంగా వీరి మాటలు తూటల్లా పేలడంతో ఇది బంధాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అందువలన ఈ రాశి వారు మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.

ధనస్సు రాశి :ధనస్సు రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని నిందలు మోయాల్సి వస్తుంది. ఆర్థికంగా నష్టపోతారు. మీరు నమ్మినవారే మిమ్మల్ని మోసం చేస్తారు. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా కూడా బలంగా ఉండాలి. గ్రహణ ప్రభావం వీరిపై చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉన్నదంట.