Kubera Yoga: శని, శుక్రుల యుతి..ఆ రాశుల వారికి అపర కుబేర యోగం..!

Edited By:

Updated on: Feb 21, 2026 | 7:21 PM

Wealth Yoga: మార్చి 2 నుంచి 26వ తేదీ వరకు మీన రాశిలో శని, శుక్రులు కలవడం జరుగుతోంది. మిత్ర గ్రహాలైన శని, శుక్రులు ఎప్పుడు ఏ రాశిలో కలిసినా కొన్ని రాశుల వారికి అపర కుబేర యోగం పడుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మీన రాశి శుక్రుడికి ఉచ్ఛరాశి. ఇక్కడ శనితో కలవడం వల్ల కొందరి జీవితాలల్లో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. నిరుద్యోగం, పేదరికం, జీవిత సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశుల వారికి ధన లక్ష్మీయోగం, ధన ధాన్య సమృద్ధి యోగం, అపర కుబేర యోగం తప్పకుండా కలుగుతాయి.

1 / 6
వృషభం:ఈ రాశికి లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్న శుక్ర గ్రహం అదే రాశిలో ఉన్న  శనీశ్వరుడితో యుతి చెందడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా కలసివస్తుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. రాజయోగాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.

2 / 6
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శనీశ్వరుడితో ఉచ్ఛ శుక్రుడు కలవడం వల్ల జీవనశైలి పూర్తిగా మారి పోతుంది. సామాన్యుడు సైతం సంపన్నుడుగా మారే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆస్తి, సంపద కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు తప్పకుండా ఆస్కారముంటుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉన్నత స్థాయి పరి చయాలు ఏర్పడతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

3 / 6
కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉచ్ఛ శుక్రుడు, శనీశ్వరుడు కలవడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఇంటా బయటా సుఖసంతోషాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి.

4 / 6
కన్య: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు సప్తమ స్థానంలో ఉచ్ఛపట్టి శనితో కలవడం వల్ల ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ క్రమంగా వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి.

5 / 6
మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడితో ఉచ్ఛ శుక్రుడి యుతి వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ఆదాయ వృద్ధి, పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని ఫలితాలు పొందుతారు.  నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది.

6 / 6
కుంభం: ఈ రాశికి ధనస్థానంలో ఉన్న రాశ్యధిపతి శనీశ్వరుడితో ఉచ్ఛ శుక్రుడు యుతి చెందడం వల్ల జీవితంలో కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అనూహ్యమైన సత్ఫలితాలనిస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి నిశ్చయమవుతుంది. దాంపత్య సమస్యలనుంచి బయటపడి, అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగుల విదేశీ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.

Follow Us