
మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో, అంటే కెరీర్ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి పని భారం, పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అధికారులు అలవికాని లక్ష్యాలను, అదనపు బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేసే సూచనలు కూడా ఉన్నాయి. విశ్రాంతి కరువయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉండడం జరుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి.

సింహం: ఈ రాశికి అష్టమంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు ఉద్యోగ స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల ఉద్యో గంలో భారీ లక్ష్యాలు, అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. అధికారుల నుంచి వేధింపులు కూడా ఉండవచ్చు. ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగవలసి వస్తుంది. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో పని ఒత్తిడి, వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ తక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కూడా పని భారం బాగా పెరుగుతుంది. ఉద్యోగపరంగానే కాక, కుటుంబపరంగా కూడా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది.

ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల ఈ రాశివారికి ప్రతి పనీ భారంగా మారుతుంది. శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమాధిక్యత వల్ల విశ్రాంతి కరువ వుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల అవిశ్రాంతంగా పని చేయవలసి వస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి వస్తుంది. ప్రయాణాల వల్ల ధన నష్టం తప్ప లాభం ఉండకపోవచ్చు.

మీనం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శని వల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ పనిని చేపట్టినా ఒకపట్టాన పూర్తయ్యే అవకాశం ఉండదు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ అసంపూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్య తలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ లాభం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాల్లో చికాకులు ఉంటాయి.