
ఏలి నాటి శని చాలా ప్రత్యేకమైనది. ఇది ఈ సమయంలో ఒక వ్యక్తికి క్రమశిక్షణ, పట్టుదలను పరీక్షిస్తుంది. అంతే కాకుండా జీవిత పాఠాలను నేర్పిస్తుంది. అలాగే కష్టపడి పని చేసేవారికి, బాధ్యతాయుతంగా ఉండేవారికి అనేక ప్రయోజనాలను తీసుకొస్తుంది. అలాగే ఇది కొంత మందికి ప్రయోజనాలను చేకూరిస్తే మరికొంత మందికి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తుంది. కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది.

అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు సాడే సవితి అంటే ఏమిటని? కాగా, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి చంద్ర రాశి నుంచి 12వ ఇంటిలోకి ప్రవేశించడం జరుగుతుంది. దీనినే ఏలినాటి శని అంటారు. తర్వాత చంద్ర రాశి నుంచి రెండవ ఇంటిలోకి ప్రవేశించడం జరుగుతుంది. శని రెండున్నర సంవత్సరాలు ఇందులోనే సంచరిస్తుంది. అంతే కాకుండా తన ప్రయాణానికి ఏడున్నర సంవత్సరాలు పడుతుంది. ఈ సమయాన్ని ఏలి నాటి శని అంటారు. ఇక ఇందులో మూడు దశలు ఉంటాయి.

మొదటి దశ : ఇది ఒక వ్యక్తి చంద్ర రాశి నుంచి 12 ఇంటిలోకి ప్రవేశించడం ప్రారంభించినప్పుడు సాడే సవితి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా ఖర్చులు పెరగడం, మానసిక ఒత్తిడి, వృత్తి వ్యాపారాల్లో మార్పులు రావడం కుటుంబ బాధ్యతలు పెరగడం వంటి అనేక సమస్యలు ఎదురు అవుతాయి.

రెండవ దశ : శని చంద్ర రాశిలో సంచరించినప్పుడు రెండవ దశ ప్రారంభం అవుతుంది. ఇది భావోద్వేగ ఒత్తిడి, వృత్తికి సంబంధించిన అనేక సమస్యలను తీసుకొస్తుంది. కానీ ఎవరు అయితే క్రమశిక్షణతో ఉంటారో వారికి విజయాలను ఇస్తుంది. ఈ సమయంలో ఓర్పు,పట్టుదల చాలా అవసరం.

చివర దశ :శని చివరి దశ చాలా కీలకమైనది. ఆర్థిక విషయాలు, కుటుంబ సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఇది చాలా విలువైన జీవిత పాఠాలను నేర్పిస్తుంది. స్థిరత్వ భావనను అందిస్తుంది. అంతే కాకుండా సంబంధాలలో గొప్ప స్థాయికి చేర్చుతుంది.