
జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల్లో రాహువు గ్రహం కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని ఛాయ గ్రహం అని కూడా అంటారు. ఇది ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడానికి సంవత్సర కాలం పడుతుంది. ఈ గ్రహం ప్రస్తుతం నక్షత్ర సంచారం చేస్తుంది. రాహువు ఆగస్టు 2న ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేయడం వలన ఇది నాలుగు రాశుల పై ప్రభావం చూపుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి : మేష రావి వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అవ్వడంతో చాలా ఆనందంగా జీవిస్తారు. ఆర్థికంగా , ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి తోబుట్టువులు అండగా నిలుస్తారు. ఈ రాశి విద్యార్థులు మంచి స్థాయిలో ఉంటారు.

కన్యా రాశి : కన్యారాశి వారికి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం కలిసి వస్తుంది. వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

తుల రాశి :తుల రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. వీరికి ఇది చాలా మంచి సమయం. ఇక రాహువు ధనిష్ట నక్షత్రంలోకి మారడం వలన వీరికి డబ్బు అవసరానికి చేతికి అందుతుంది. వీరికి కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయి. అంతే కాకుండా వీరికి ఎవరు అయితే మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి మంచి సంబంధం దొరుకుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

మకర రాశి :మకర రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా సమాజంలో వీరికి ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. చాలా రోజుల నుంచి అప్పుల బాధలతో సతమతం అయ్యే వారు వాటి నుంచి త్వరగా బయటపడతారు. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.