
మార్చి నెలలో రాహు గ్రహం కుంభరాశిలోకి సంచారం చేస్తాడు, కేతువు సింహ రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ సమయంలో అన్నీ గ్రహాలు రాహు, కేతువుల మధ్య ఉంటాయి. దీంతో కాల సర్ప యోగం ఏర్పడుతుంది. అయితే ఈ సారి నాలుగు రాశుల వారికి ఈ కాల సర్ప యోగం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

తుల రాశి : తుల రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలను ఇస్తుంది. కాల సర్ప యోగం వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి జాబ్ దొరుకుతుంది.

మీన రాశి : కాల సర్ప యోగం వలన మీన రాశి వారికి బాగుంటుంది. వీరు ప్రతి సమస్యను చాలా త్వరగా పరిష్కరించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి పనిలో ధైర్యంతో ముందడుగు వేస్తారు. అన్నింటా శుభ ఫలితాలు కలుగుతాయి.

మకర రాశి: మకర రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలే, వీరికి ఆదాయం పెరుగుతుంది. సంపద డబుల్ అవుతుంది. అనుకోని విధంగా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నీంట శుభ ఫలితాలే కలుగుతాయి.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కాలసర్పయోగం వలన అద్భుతంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. ఏ పని చేసినా ఇట్టే సక్సెస్ అవుతారు.