
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానమైన కర్కాటక రాశిలో రాశ్యధిపతి కుజుడు ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువుతో కలిసి ఉండడం వల్ల ఈ రాశివారికి కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. జీవితం సంతృప్తికరంగా, సానుకూలంగా సాగుతుంది. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు మార్గం సుగమం అవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఇష్టమైన బంధువులు, కుటుంబ సభ్యుల రాకపోకలుంటాయి. కుటుంబం కోసం వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది.

మిథునం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, పంచమ స్థానంలో రాశ్యధిపతి బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఈ రాశివారికి మనసులోని కోరికల్లో చాలా భాగం నెర వేరుతాయి. గృహ ప్రవేశం, పెళ్లి, విదేశీయానం, విహార యాత్రలు, తీర్థయాత్రలు వంటివి జరిగే అవ బకాశం ఉంది. కొందరు బంధుమిత్రులతో విభేదాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత కలుగు తుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగావిముక్తి లభిస్తుంది.

కర్కాటకం: ఈ రాశిలో భాగ్యాధిపతి ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు కూడా కలిసి ఉండడం వల్ల శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఒకటి రెండు కీలక మైన శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇంట్లో పండుగ వాతావరణం చోటు చేసు కుంటుంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ముఖ్యమైన ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది.

కన్య: రాశ్యధిపతి బుధుడు ద్వితీయ స్థానంలో, అంటే ధన, కుటుంబ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండ డం, గురువు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలోసంచారం చేస్తుండడం వల్ల ఈ రాశివారి కుటుంబంలో శుభ కార్యాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఇష్టమైన బంధుమిత్రులతో ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెంది, రావలసిన సొమ్ము చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి.

తుల: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడితో భాగ్యాధిపతి బుధుడు కలిసి ఉండడం, దశమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారు మానసిక ప్రశాంతతతో పాటు సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మానసిక ఒత్తిడి బాగా తగ్గి నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించడంతో పాటు, జీత భత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు లాభిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితితో పాటు దశమంలో శుక్ర, బుధుల సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి మానసికంగా ఊరట లభిస్తుంది. ప్రముఖులతో పరి చయాలు వృద్ధి చెందడంతో పాటు రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభి స్తాయి. శుభకార్యాలకు మార్గం సుగమం కావడంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.