Crorepati Yoga: రెండు నెలల్లో వీరు కోటీశ్వరులయ్యే యోగం..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

Edited By:

Updated on: Oct 14, 2026 | 3:30 PM

వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో కొన్ని రాశుల వారు కచ్చితంగా కోటీశ్వరులు కాబోతున్నారు. అక్టోబర్ 31న గురువు సింహ రాశిలో ప్రవేశించడం, బుధ, శుక్రులు తులా రాశిలో కొనసాగడం వల్ల మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశుల వారికి దశ తిరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం గడించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అపారంగా లాభిస్తాయి. సాధారణ వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది.

1 / 6
మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో ధన కారకుడు, భాగ్యాధిపతి అయిన గురువు ప్రవేశించడం, సప్తమ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఈ రాశివారికి నవంబర్ నుంచి ఆదాయం వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం, సంపద వృద్ధి చెందుతాయి. ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. తల్లితండ్రుల నుంచి విలువైన ఆస్తి వారసత్వంగా సంక్రమిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించి పెరుగుతాయి.

2 / 6
కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలోకి గురువు, చతుర్థ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారమవుతుంది. ఆకస్మిక ధన లాభా నికి బాగా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు కనక వర్షం కురిపిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించి వృద్ధి చెందుతుంది.

3 / 6
తుల: ఈ రాశిలో బుధ, శుక్రుల సంచారం, లాభ స్థానంలోకి గురువు ప్రవేశం వల్ల ఆదాయపరంగా ఈ రాశివారి అదృష్టం కొత్త పుంతలు తొక్కుతుంది. అనేక వైపుల నుంచి ధన ‍ప్రవాహం ఉంటుంది. ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. రావలసిన డబ్బు, రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా సాగిపోతాయి. ఆర్థిక లావా దేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది.

4 / 6
వృశ్చికం: ధనాధిపతి, ధన కారకుడైన గురువు దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారి కెరీర్ కొత్త పుంతలు తొక్కుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించి, జీతభత్యాలు పెరిగినప్పటికీ, మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని దాటుతుంది. ఆస్తి వివా దాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. తండ్రి వైపు నుంచి విలువైన ఆస్తి కలిసి వస్తుంది.

5 / 6
ధనుస్సు: రాశ్యధిపతి గురువు ఈ రాశికి భాగ్య స్థానంలో ప్రవేశించడం, లాభ స్థానంలో బుధ, శుక్రుల సంచా రం కొనసాగడం వల్ల నవంబర్, డిసెంబర్ నెలలు ఈ రాశివారికి అదృష్టాన్ని పండిస్తాయి. అనేక పర్యాయాలు ధన యోగాలు కలిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల వల్ల ధన లాభం కలుగుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. గృహ యోగం పడుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు ఆదాయం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతాయి.

6 / 6
కుంభం: ఈ రాశికి ధన, లాభాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలోను, బుధ, శుక్రులు భాగ్యస్థానం లోనూ సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభాలకు బాగా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అత్యధికంగా ధనాదాయ అవకాశాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాల్ని మించి లాభిస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. వారసత్వ సంపద లభిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us