Astrology 2026: కొత్త సంవత్సరంలో వారికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు..!

Edited By:

Updated on: Dec 11, 2025 | 6:59 PM

గురు, శనులు అనుకూలంగా ఉన్న రాశుల వారికి రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయని, వీరి మాటకు, చేతకు సమాజంలో విలువ ఉంటుందని, వీరి సలహాలు, సూచనలకు ప్రాధాన్యం ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. గోచారం ప్రకారం కొత్త సంవత్సరంలో ఈ రెండు ప్రధాన గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్న రాశులు వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం. వీరికి ఇంటా బయటా గౌరవ మర్యాదలు లభిస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ది చెందుతాయి. ఒక ప్రముఖుడుగా, సంపన్నుడుగా గుర్తింపు లభిస్తుంది.

1 / 6
వృషభం: ఈ రాశికి కొత్త సంవత్సరమంతా శని, గురువులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల తప్పకుండా రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల నుంచి సన్మానాలు, సత్కారాలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. పట్టిందల్లా బంగారం అవుతుంది.

2 / 6
మిథునం: ఈ రాశిలో గురువు, దశమ స్థానంలో శని సంచారం వల్ల పేరు ప్రఖ్యాతులు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అత్యంత ప్రముఖులకు కూడా సన్నిహితం అవుతారు. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది.

3 / 6
కర్కాటకం: ఈ రాశికి శని, గురువులిద్దరూ అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశివారికి విజయాలు ఎక్కువగా సిద్ధిస్తాయి. కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగాలు లభిస్తాయి. ఆస్తి సమస్యలు అనుకూ లంగా పరిష్కారమై భూలాభం, ఆస్తి లాభం కలుగుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమవుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. అనేక విధాలుగా బంధుమిత్రుల్లోనూ, సామాజికంగానూ, రాజకీయంగానూ ప్రాబల్యం పెరుగుతుంది. విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది.

4 / 6
కన్య: ఈ రాశివారికి శని, గురువుల అనుకూలత వల్ల కొత్త సంవత్సరంలో తప్పకుండా రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. గౌరవమర్యాదలు, పలుకుబడి వృద్ది చెందుతాయి. అనేక విధాలుగా ఆస్తి కలిసి వచ్చి ఒక సంపన్నుడుగా గుర్తింపు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి కూడా అపారంగా లాభిస్తాయి. వీరి సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ది పొందుతారు.

5 / 6
వృశ్చికం: ఈ రాశివారికి కొత్త సంవత్సరం అనేక విధాలుగా కలిసి వస్తుంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడంతో పాటు, ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. కొన్ని ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడి ఉత్సాహవంతమైన, సంతృప్తికరమైన జీవితం గడపడం జరుగుతుంది. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు విజయాలు సాధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది.

6 / 6
మకరం: ఈ రాశికి శని, గురువులు పూర్తి స్థాయిలో అనుకూలంగా మారుతున్నందువల్ల కొత్త సంవత్సరంలో వీరి జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. రాజకీయంగా ప్రాబల్యం కలుగుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెంది ఒక సంపన్నుడుగా గుర్తింపు లభిస్తుంది. సామాజిక సేవా కార్య క్రమాల ద్వారా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రముఖులతో సత్కారాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది.