
చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు : చేపలు, ఆనియన్, కారం, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మెంతి పొడి, ఉప్పు, నూనె, చింత పండు, కొత్తిమీర, పచ్చి మిర్చీ, పసుపు.

తయారీ విధానం : ముందుగా చేపలను తీసుకొని గోరు వెచ్చటి నీటిలో కొంచెం, పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి శుభ్రం చేయాలి. చేపలు శుభ్రం అయిన తర్వాత వాటిని వేరే బౌల్‌లోకి తీసుకొని చేప ముక్కల్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దాదాపు 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఆనియన్ తీసుకొని దానిని మంటపై మంచిగా కాల్చుకోవాలి. దీని వలన చేపల పులుసు త్వరగా పాడవకుండా ఉండటమే కాకుండా రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కాల్చుకున్న ఆనియన్, టమాటాలను మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌ను పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి. అందులో సరిపడ నూనె వేయాలి. నూనె మంచిగా వేడి అయిన తర్వాత అందులో పచ్చి మిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసి మంచిగా వేయించుకోవాలి. ముక్కలు మంచిగా వేగాలా చూసుకోవాలి.

ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా, ఆనియన్ పేస్ట్ వేసి కలుపుకోవాలి మరో ఐదు నిమిషాలు. తర్వాత అందులో చింత పండు రసం వేసుకోవాలి. అలాగే తగినన్ని నీరు కూడా వేసేసుకొని పులుసు చిక్క బడి ముక్క మెత్తగా ఉడికే వరకు, ముక్కలను కదపకుండా, పులుసు మరగబెట్టాలి. అది బాగా మరిగిన తర్వాత అందులో ధనియాల పొడి, ఉప్పు, కారం, మెంతి పొడి వేసి మరో ఐదు నిమిషాలు మరగబెట్టాలి. చివరగా అందులో కొత్తిమీర వేయాలి. అంతే టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ.