
ఈశాన్యంలో నాటకూడదు : వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ మొక్కను ఈశాన్యం దిశలో పెంచుకోకూడదు. ఇది అనేక సమస్యలకు కారణం అవుతుందంట. అంతే కాకుండా ఇది డబ్బు ఆగిపోవడం లేదా సంపద తరిగిపోవడం జరుగుతుందంట. అందుకే ఈశాన్యంలో మనీ ప్లాంట్ నాటకూడదు.

తీగలు నేల తాకడం : అలాగే మనీ ప్లాంట్ పెంచుకునే ముందు తప్పకుండా తీగల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మనీ ప్లాంట్ తీగ ఎప్పుడూ కూడా నేలకు తాగకూడదు. ఎవరింటిలోనైతే మనీ ప్లాంట్ తీగలు నేలను తాకుతాయో, వారి ఇంటిలో ఆర్థిక స్థిరత్వం ఉండదు. అప్పుల బాధలు ఎక్కువ అవుతాయంటజ

ఎండిన ఆకులు తొలిగించడం : మనీ ప్లాంట్ మొక్క ఎండిన ఆకులను కూడా చాలా త్వరగా వెంట వెంటనే తొలిగించాలి. ఎందుకంటే ఇవి చాలా వరకు మంచిది కాదు, ఇది దురదృష్టాన్ని తీసుకొస్తాయి. అనేక సమస్యలకు కారణం అవుతాయి. అందుకే ఎండిన ఆకులను వెంటనే తొలిగించాలని చెబుతున్నారు వాస్తునిపుణులు.

మనీ ప్లాంట్ మొక్కను బహుమతిగా ఇవ్వడం : ఎవరు అయితే మనీ ప్లాంట్ మొక్కను బహుమతిగా ఇస్తారో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా వారి ఇంటి లక్ష్మీదేవిని, అదృష్టాన్ని ఇతరులకు ఇచ్చినట్లే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే అస్సలే మనీ ప్లాంట్ మొక్కను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదంట.

మనీ ప్లాంట్ మొక్క నీరు మార్చకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడం చేయకూడదంట. ఎందుకంటే ఒక వేళ మొక్క ఎండిపోతే, అది అనేక సమస్యలకు కారణం అవుతుంది అని చెబుతున్నారు వాస్తు నిపుణులు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.